పెళ్లికి నిరాక‌రించిన యువతి హ‌త్య ఆపై యువకుడి ఆత్మహత్య

పెళ్లికి నిరాక‌రించిన యువతి హ‌త్య ఆపై యువకుడి ఆత్మహత్య

కర్ణాటకలో దారుణం జ‌రిగింది. ఓ అమ్మాయి త‌న‌తో పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ని, ఆ ఉన్మాది ఆమెను చంపేశాడు. ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బెల్గావిలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నాథ్ పాయి స‌ర్కిల్ వ‌ద్ద 20 ఏళ్ల ఐశ్వ‌ర్య మ‌హేహ్ లోహ‌ర్ అనే అమ్మాయిని.. 29 ఏళ్ల ప్ర‌శాంత్ కుందేక‌ర్ హ‌త్య చేశాడు. బెల్గావి తాలుక‌లోని యెల్లూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పెళ్లికి నిరాక‌రించిన యువతి హ‌త్య ఆపై యువకుడి ఆత్మహత్య

పెళ్లి చేసుకోవాల‌ని ఆమెను వ‌త్తిడి
ఐశ్వ‌ర్య‌ను ఏడాది కాలం నుంచి ప్ర‌శాంత్ ప్రేమిస్తున్నాడు. పెయింట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఆ వ్య‌క్తి.. గ‌తంలో ఓ సారి ఐశ్వ‌ర్య త‌ల్లిని పెళ్లి గురించి ప్ర‌స్తావించాడు. ఐశ్వ‌ర్య‌ను పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పాడు. కానీ ఆర్థికంగా స్థిరప‌డాల‌ని బాధితురాలి త‌ల్లి నిందితుడికి హిత‌బోధ చేసింది. ఐశ్వ‌ర్య పిన్ని ఇంటికి విషం బాటిల్‌తో వెళ్లిన ప్ర‌శాంత్‌.. పెళ్లి చేసుకోవాల‌ని ఆమెను వ‌త్తిడి చేశారు. ప్ర‌శాంత్ అభ్యర్థ‌న‌ను ఆమె తిర‌స్క‌రించింది. విషం తాగేలా ఐశ్వ‌ర్య‌ను వ‌త్తిడి చేశాడు. కానీ ఆమె అడ్డుకున్న‌ది. ఆ స‌మ‌యంలో త‌న జేబులో ఉన్న క‌త్తిని తీసి.. ఐశ్వ‌ర్య గొంతు కోశాడు ప్ర‌శాంత్‌. విప‌రీతంగా ర‌క్త స్త్రావం కావ‌డంతో ఐశ్వ‌ర్య మృతిచెందిన‌ట్లు తేల్చారు. ఆ త‌ర్వాత అదే క‌త్తితో.. త‌న గొంతు కోసుకున్న ప్ర‌శాంత్‌.. అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు సీనియ‌ర్ పోలీసు అధికారి, సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ యాద మార్టిన్ తెలిపారు.

పోలీసు చర్యలు
సీనియర్ పోలీస్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ యాద మార్టిన్ ఈ ఘటనపై స్పందించారు.
దర్యాప్తు కొనసాగుతోంది. ప్రేమలో విఫలమైన యువతులు, యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Related Posts
బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతి
BJP MLA Devender Rana passed away

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో కొంతకాలం బాధపడుతూ Read more

మోడీ పాలనలో 9వేల మంది మిలిటెంట్లు లొంగుబాటు
amithsha

మోడీ పాలనలో 9వేల మంది మిలిటెంట్లు లొంగుబాటు--కేంద్ర మంత్రి అమిత్ షా అగర్తలా : ప్రధాని నరేంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర Read more

WPL 2025 పూర్తి షెడ్యూల్
WPL 2025 పూర్తి షెడ్యూల్

మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క మూడవ ఎడిషన్ ఫిబ్రవరి 14 న ప్రారంభమవుతుంది మరియు మొదటి WPL నాలుగు నగరాల్లో-బరోడా, బెంగళూరు, ముంబై మరియు లక్నోలో ఆడబడుతుంది, Read more

Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..
Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నాపత్ర లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన Read more