Andhra Pradesh :రాజధాని నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్

AndhraPradesh :రాజధాని నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్

అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబరులో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది.వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది.

Advertisements

మొదటి విడత

ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు(ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి.మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్‌ఆర్‌బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్‌ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్‌ విగ్రహం, ఐకానిక్‌ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విలువ రూ.16,871 కోట్లు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు . ఇక ఇక్క‌డ నిర్మాణ ప‌నులు ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Dhyana Buddha Statue Amaravati Vijayawada Andhra Pradesh hero hs

పనులు ప్రారంభం

ఏప్రిల్‌ మూడో వారంలో ప్రధాని చేతుల మీదగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్దసంఖ్యలో కార్మికులు వస్తున్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే పనులు కూడా సమాంతరంగా సాగనుండడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలకు చేతినిండా పని ఉంటోంది. నిర్మాణాలకు ముందస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయా సంస్థలు బిజీగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాల వద్ద కార్మికుల కోసం భారీస్థాయిలో రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు.ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ కాంట్రాక్టు పొందిన కేఎంవీ సంస్థ ఆ నిర్మాణాలకు సమీపంలో షెడ్లు నిర్మిస్తోంది. రాజధానిలో ఈ-6 నిర్మాణ కాంట్రాక్టు తాజాగా పొందిన ఆర్‌వీఆర్‌ కంపెనీ తుళ్లూరు శివారులో గతంలో వేసిన షెడ్లను సకల సౌకర్యాలతో కార్మికుల కోసం సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు వెలగపూడిలో ఇటీవల కొన్న స్థలానికి పనులు ప్రారంభించింది.రాయపూడి కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఫిల్టర్‌ ట్యాంకు పైపులైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు కంప చెట్ల తొలగింపు,చదును చేయడం వంటి పనుల్లో పెద్దసంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.

Related Posts
రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు
Rajahmundry to Delhi.. Start of flight service

రాజమండ్రి: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌లు ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ పరిణామానికి ముందు, ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి తొలి Read more

శ్రీవారి అన్నప్రసాద మెనూలో మార్పులు..
Changes in Srivari Annaprasadam menu

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా Read more

వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలపై అభ్యంతరం
వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలపై అభ్యంతరం

వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలపై హోం మంత్రుల అభ్యంతరం వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలపై మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు Read more

Pawan Kalyan : ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×