OTT:ఓటీటీలోకి ఆది ‘షణ్ముఖ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT:ఓటీటీలోకి ఆది ‘షణ్ముఖ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ నటించిన ‘షణ్ముఖ’ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన వచ్చింది, ఆది సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘షణ్ముఖ’. ఈ సినిమాకు షణ్ముగం సాప్పని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ ఫేమ్ అవికాగోర్ క‌థ‌నాయిక‌గా న‌టించింది. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ ప‌తాకంపై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించింది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది.

Advertisements

కథ

మారుమూల గ్రామంలో,నిత్యం పూజలు చేసే ఉపాసకుడు విగాండ (చిరాగ్ జానీ) దంపతులకు ఆరు ముఖాలతో కురూపిగా ఉన్న కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడి ముఖం చూసిన వారాంత షాక్ గురవుతుంటారు. తన కుమారుడికి విగాండ షణ్ముఖ అని నామకరణం చేస్తాడు. తన కుమారుడు కూరుపి అవతారం నుంచి అందగాడుగా కావడానికి మాంత్రికుడి సలహాతో ఓ ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా, కార్తీ (ఆది సాయికుమార్) పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియాను పట్టుకొనేందుకు వెళ్లిన దాడిలో తన పిస్టల్ కోల్పోతాడు. ఇక కాలేజీలో లవర్సా,సారా (అవికా గోర్) క్రిమినాలజీపై రీసెర్చ్ చేసి అదృశ్యం అవుతున్న అమ్మాయిల ఆచూకీ కోసం ఆరా తీస్తుంటుంది.తన కుమారుడిని అందగాడిగా చేయడానికి విగాండ ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు? అమ్మాయిల అదృశ్యానికి విగాండకు ఎదైనా సంబంధం ఉందా? కార్తీ, సారా ఎందుకు విడిపోయారు? కార్తీ, సారా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా? పొగొట్టుకొన్న తుపాకిని కార్తీ సంపాదించుకొన్నాడా? సారాను విగాండ మనుషులు కిడ్నాప్ చేసి ఏం చేశారు? ఈ కథలో శ్రీకాంత్(కౌశిక్), వర్షిత (అరియానా గ్లోరి), కమల్ (ఆదిత్య ఓం) పాత్రలు ఏంటి? షణ్ముఖ చివరికి అందగాడుగా మారాడా? అనే ప్రశ్నలకు సమాధానమే షణ్ముఖ సినిమా కథ.

 OTT:ఓటీటీలోకి ఆది ‘షణ్ముఖ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

విశ్లేషణ

ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్ తగినట్టుగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ను చక్కగా చూపించాడు.కథలో వేరియేషన్స్ ఎక్కువగా ఉండటం అలాగే పాత్రలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల సోలోగా ఆది చేయడానికి స్కోప్ లేకపోయింది. అవిక గోర్ గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసింది. చిరాగ్ జానీ, ఆదిత్య ఓం తదితరులు ఫర్వాలేదనిపించారు. ఆరియానా గ్లోరి ఇతరులు అతిథి పాత్రలకే పరిమితమయ్యారు.టెక్నికల్ విషయానికి వస్తే,ఈ సినిమాకు అసలు సిసలైన హీరో రవి బస్రూర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. చివరి 20 నిమిషాలు సినిమాలో రవి బస్రూర్ మార్క్ కనిపించింది. మిగితా సాంకేతిక అంశాలు ఫర్వాలేదనిపిస్తాయి. తులసీరామ్ సాప్పని, రమేష్ యాదవ్, షణ్ముగం సాప్పని అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన సాంగ్ ఆకట్టుకొనేలా ఉంది.

Read Also: Tollywood: శ్రీవారి సన్నిధిలో అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీమ్

Related Posts
బాలకృష్ణ ఇంటిని ఢీకొట్టిన కారు
బాలకృష్ణ ఇంటి ముందు బీభత్సం! వేగంగా దూసుకొచ్చిన కారు ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది!

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1లో వేగంగా Read more

Most Handsome Actor: ప్రపంచంలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఎవరో తెలుసా? షారుక్ ఖాన్‌కు పదో స్థానం
shah rukh khan

ప్రపంచంలో అత్యంత అందమైన నటుల జాబితా గురించి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా తయారు చేసిన ఒక లిస్ట్ ఇటీవల బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ Read more

బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సీన్లలో రోషన్ నటించేశాడు.
mowgli

టాలీవుడ్‌లో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా అడుగుపెట్టడం విశేషం. బబుల్ గమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన రోషన్, మొదటి సినిమాతో Read more

మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్
మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో హీరో సిద్ధార్థ్ స్నేహితుడిగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×