సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?

sudiksha konanki: సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?

డొమినికన్ రిపబ్లిక్‌లో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన భారతీయ సంతతికి చెందిన సుదీక్ష కోణంకి చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం అక్కడి పోలీసులను కోరింది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన సుదీక్ష కోణంకి(20) గత రెండు వారాల నుంచి కనిపించడం లేదు. అప్పటి నుంచి పోలీసులు సుదీక్ష కోసం గాలింపు చేపట్టారు. డొమినికన్ రిపబ్లిక్‌లో మార్చి 6న తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఆమె చివరిసారిగా ఒక హోటల్‌ సమీపంలో కనిపించారు. అయితే, రెండు వారాల పాటు వెతికినా సుదీక్ష ఆచూకీ దొరకలేదు. దీంతో, ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని కుటుంబ సభ్యులు అభ్యర్థించినట్లు డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు బీబీసీకి ధ్రువీకరించారు. కానీ, అంతకన్నా ఎక్కువగా వివరాలు చెప్పలేదు. సుదీక్ష నీటిలో మునిగిపోయిందేమోనని పోలీసులు రెండు వారాలుగా గాలిస్తున్నారు. అదే సమయంలో ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగి ఉంటుందా అన్న విషయాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు.

సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు?

ఎవరీ సుదీక్ష కోణంకి?
సుదీక్ష కోణంకి పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని. అక్కడ ఆమె జీవశాస్త్రం, రసాయన శాస్త్రం చదువుతున్నారు. లౌడౌన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం.. సెలవులు రావడంతో సుదీక్ష తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాలోని ఒక రిసార్ట్‌కు వెళ్లారు. సుదీక్ష కోణంకి భారత పౌరురాలు, అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ కూడా. కుటుంబంతో కలిసి ఆమె వర్జీనియా రాష్ట్రంలోని చాంటిల్లీ ప్రాంతంలో ఉంటున్నారు.
చివరిసారిగా ఎక్కడ కనిపించారు?
సుదీక్ష మార్చి 6న తెల్లవారుజామున చివరిసారిగా కనిపించారు. ఆమె స్నేహితులతో కలిసి బీచ్ వైపు వెళుతున్నట్లు నిఘా వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఆమెతో పాటు ఐదుగురు యువతులు, ఇద్దరు అమెరికన్ యువకులు కనిపించారు. సుదీక్ష ఆ యువకులలో ఒకరితో బీచ్‌లోనే ఉండిపోయారని, మిగిలిన వారు హోటల్‌కు తిరిగి వచ్చారని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు అమెరికాలో బీబీసీ భాగస్వామి వార్తాసంస్థ సీబీఎస్‌కు చెప్పారు. బీచ్‌లో ఉన్నప్పుడు ఒక అల తమ ఇద్దరినీ తాకిందని చివరిగా ఆమెతో ఉన్న జాషువా రీబే అనే యువకుడు చెప్పారని డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ తెలిపారు. జాషువా రీబే మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థి. జాషువా రీబే తల్లిదండ్రులు సీబీఎస్ న్యూస్‌కు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సుదీక్ష వీలైనంత త్వరగా దొరకాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దర్యాప్తు అధికారులు ఏం చెబుతున్నారు?
సుదీక్ష మరణించినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం నుంచి అభ్యర్థన అందిందని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు బీబీసీతో చెప్పారు. తప్పిపోయిన విద్యార్థిని కోసం చాలా గంటలుగా వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వెతకాల్సిన ప్రాంతాలను విభజించి, డ్రోన్‌ సాయంతో వీడియో తీశారు. ఆ ఫుటేజీని కమాండ్ సెంటర్‌కు పంపుతున్నారు. అక్కడ సముద్రంలో వస్తువులను వెతికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పైలట్లు ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సెర్చ్ బృందాలు సుదీక్ష కోసం ఓవైపు నీటిలో, మరోవైపు భూమిపైనా వెతుకుతున్నాయి. సుదీక్ష కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్‌పోల్ నోటీసులు
సుదీక్ష అదృశ్యమైన తర్వాత ఇంటర్‌పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) గ్లోబల్ అలర్ట్‌ను జారీ చేసింది. తప్పిపోయిన వ్యక్తుల (కిడ్నాపైన లేదా కారణం తెలియని అదృశ్యం) కోసం ఎల్లో నోటీసు జారీచేస్తారు.

Related Posts
గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు
Prabowo Subianto

భార‌త 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా Read more

పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం
Pakistan bomb blast.. 10 dead

పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదన అధికారులు ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు Read more

Sri lanka: శ్రీలంక పోలీసు చీఫ్ టెన్నకూన్‌పై వివాదం – పార్లమెంటు చర్యలు
శ్రీలంక పోలీసు చీఫ్ టెన్నకూన్‌పై వివాదం – పార్లమెంటు చర్యలు

పోలీసు చీఫ్ తొలగింపును కోరుతూ 115 మంది ఎంపీల లేఖశ్రీలంక అధికార పార్టీకి చెందిన 115 మంది ఎంపీలు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) దేశబందు Read more

తక్కువ టైమ్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మలమ్మ
nirmala

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఇప్పటివరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎనిమిదో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *