nirmala

తక్కువ టైమ్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన నిర్మలమ్మ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఇప్పటివరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎనిమిదో సారి ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక గంటా 14 నిమిషాల పాటు జరిగింది. అయితే ఈ సారి మాత్రమే ఆమె తక్కువ సమయంలో బడ్జెట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 1 న ఆమె ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కేవలం 56 నిమిషాలు మాత్రమే సాగింది. 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. 2020లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు జరిగింది. సమయం మరీ ఎక్కువ అవుతుండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యధిక సమయం కావడం గమనార్హం.

Advertisements

వేతన జీవులకు వరాలు.. వేతన జీవులకోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు నిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ ధరలపై ఫోకస్.. వంటనూనెలపై దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది.నూనెల ధరలు పేదవాడికి భారంగా మారిన నేపథ్యంలో వంటనూనెల ధరల తగ్గింపునకు ఆరు సంవత్సరాల మిషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Related Posts
కేజ్రీవాల్‌పై మోదీ విమర్శలు
కేజ్రీవాల్ పై మోదీ విమర్శలు

తన కోసం 'షీష్ మహల్' నిర్మించుకోవడానికి బదులు ప్రజలకు శాశ్వత నివాసం కల్పించడమే తన కల అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముఖ్యమంత్రి నివాసం యొక్క Read more

మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్
మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్

టెక్ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌ను ప్ర‌ధాని మోదీ క‌లిశారు. అమెరికా టూర్ వెళ్లిన మోదీ.. అక్క‌డ మ‌స్క్‌తో భేటీ అయ్యారు. అయితే బ్లెయిర్ హౌజ్‌లో జ‌రిగిన‌ భేటీలో Read more

ఆహార భద్రతా చట్టం: యూపీఏ ప్రారంభం, మోడీ మార్పులు
ఆహార భద్రతా చట్టం: యూపీఏ ప్రారంభం, మోడీ మార్పులు

ఆహార భద్రతా చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిందని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ దానిని సమగ్రంగా అమలు చేసి 80 కోట్ల మందికి Read more

ఢిల్లీలో కాంగ్రెస్ శూన్య హస్తమేనా?
CNG delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబోవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా సూచిస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య ప్రధాన Read more

×