దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా ఎస్ ఎస్ ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) పనుల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం, రాజమౌళి మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ప్రారంభంపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసి, సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు చెప్పి, షూటింగ్ ప్రారంభమైందని సంకేతం ఇచ్చారు.

ఇక, రాజమౌళి తన తదుపరి చిత్రంపై ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దాదాపు ప్రతి సినిమాకు ఆయన తండ్రే కథ రాస్తున్నారు. స్టూడెంట్ నెం.1 మినహా, ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్, తన తదుపరి సినిమా గురించి చెప్పారు. ఆయన సీతపై ఓ ప్రత్యేక కథ రాశారు. ఇందులో రామాయణాన్ని సీత కోణంలో చూపించాలని అనుకున్నారు. ఈ సినిమాను కోట్ల రూపాయల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారని చెప్పారు.అయితే, ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తాడా లేక మరెవరైనా వహిస్తారో అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే, కనీసం నాలుగేళ్లు పడే అవకాశం ఉందని చెప్పారు.