కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తోన్నారు. బాహటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతు పలుకుతున్నారు.
ఒకే వేదికపై డీకే శివకుమార్, అమిత్ షా
కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీని లేవదీసింది. ఇది అక్కడితో ఆగలేదు. దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్దుకోలేరంటూ ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని రేపింది. డీకే శివకుమార్‌లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. జనం ఏవేవో చెప్పుకొంటోన్నారు గానీ ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు


ముఖ్యమంత్రి కావడం డీకేశికి బహుమతిగా ఇవ్వాల్సింది కాదని కష్టపడి సంపాదించినదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు. వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకేశి. పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కానున్నానని చెప్పారు.
వీరప్ప మొయలీ వ్యాఖ్యలు వ్యక్తిగతం
వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని, ఏదో ఒక రోజు సీఎం అవుతాడనే అన్నాడని గుర్తు చేశారు. కష్టపడి పని చేసినందుకు డీకేకు రివార్డ్ దక్కడం ఖాయమేనని, ఈ విషయాన్ని ఖరారు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని, ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. పార్టీ, ప్రజల కోసం కష్టపడి పని చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు రివార్డు దక్కుతుందని అన్నారు. వీరప్ప మొయలీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.

Related Posts
Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం
Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం

చెన్నైలో అఖిలపక్ష సమావేశం – దక్షిణాది ఐక్యరూపం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం Read more

మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు
మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను మృత్యు కుంభ్‌గా అభివర్ణిస్తూ, అక్కడ ఉన్న ప్రణాళికలపై Read more

ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్
AAP will contest Delhi assembly elections alone: ​​Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రానున్న ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ Read more

7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!
7 వేలకు పైగా కోళ్లను చంపిన మహారాష్ట్ర ప్రభుత్వం!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రను బర్డ్ ఫ్లూ కుదిపేస్తోంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్లు, పక్షులు, జంతువులు మృత్యువాత పడగా.. తాజాగా మహారాష్ట్ర Read more