us and denmark

డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు!

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. గతంలోలాగే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను చేయాలనుకున్న పనులను అమలు చేస్తూనే.. కోరుకున్నవన్నీ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గ్రీన్‌లాండ్ కొనుగోలు చేయాలనుకున్న ట్రంప్.. ఈసారి పదవిలోకి రాకముందు నుంచే కచ్చితంగా ఈసారి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటానని చెప్పారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. ముఖ్యంగా వారి అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమ్మాలంటూ ప్రతిపాదించారు.

Advertisements

కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం అది కుదరదని చెప్పారట. పెద్ద ఎత్తున ఖనిజాలు లభించే గ్రీన్‌లాండ్‌ను అమ్మాలనే ఉద్దేశమే తమకు లేదని వివరించగా.. ట్రంప్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఈక్రమంలోనే మెటె ఫ్రెడెరిక్సన్‌తో చాలా దూకుడుగా మాట్లాడరట. తన కలను నెరువేర్చుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డారట. ఆ మాటలు విన్న ట్రంప్ వద్దనున్న అధికారులు వాటికి ఆశ్చర్యపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
మొత్తం 45 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్‌లో.. ట్రంప్ డెన్మార్క్ మీద విధించబోయే సుంకాల గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం వాటేమిటికీ భయపడకుండా గ్రీన్‌లాండ్‌ను అస్సలే అమ్మబోమని వివరించినట్లు సమాచారం.

Related Posts
BYD: ఇండియాలో BYD భారీ పెట్టుబడి..టెస్లాకు గట్టి పోటీ
ఇండియాలో BYD భారీ పెట్టుబడి..టెస్లాకు గట్టి పోటీ

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. తాజాగా అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు Read more

Trump and Zelensky: మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!
మరోసారి ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య గొడవ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య మూడేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధం ముగింపునకు చర్చలు Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

భద్రతా సమావేశంలో నెతన్యాహు కీలక చర్చ
netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు సఫెద్‌లోని ఐడీఎఫ్ ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయంలో తన భద్రతా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక Read more

Advertisements
×