Donald Trump: కాల్పుల విరమణపై రెండు గంటలు పుతిన్ తో మాట్లాడిన ట్రంప్

Read Time:  1 min
కాల్పుల విరమణపై రెండు గంటలు పుతిన్ తో మాట్లాడిన ట్రంప్
కాల్పుల విరమణపై రెండు గంటలు పుతిన్ తో మాట్లాడిన ట్రంప్
FONT SIZE
GET APP

యుద్ధాన్ని ముగించేందుకు రష్యా-ఉక్రెయిన్‌(Russia, Ukraine)లు వెంటనే చర్చలు ప్రారంభిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. సోమవారం ఇరు దేశాల నేతలతో వేర్వేరుగా మాట్లాడిన ట్రంప్, పుతిన్​(Trump, Putin)తో పిలుపు అనంతరం ఈ చర్చలు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో, ఎవరూ పాల్గొంటారో అనే విషయాలు గురించి స్పష్టంగా తెలియరాలేదు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు
అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అధ్యక్షుడు పుతిన్​తో డొనాల్డ్ ట్రంప్ దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం వల్ల వారానికి దాదాపు 5000 కంటే ఎక్కువ మందే యువత ప్రాణాలు కోల్పోతున్నారని అందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ముగింపు దిశగానే చర్చలు ప్రారంభిస్తామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుతిన్‌తో ఫోన్‌ సంభాషణ అద్భుతంగా జరిగిందని ట్రంప్ ఆ తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా-ఉక్రెయిన్‌లు వెంటనే చర్చలు ప్రారంభిస్తాయని తెలిపారు. అందుకు సంబంధించిన షరతులను ఇరు దేశాలే నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు. అయితే పుతిన్‌తో చర్చల్లో సంచలన నిర్ణయమేదీ జరగలేదని, కీలక నిర్ణయాలేవీ తీసుకోలేదని సమాచారం.

రష్యా- ఉక్రెయన్ మధ్య ప్రత్యక్ష చర్చలు
అటు ఉక్రెయిన్​తో యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తెలిపారు. శాంతియుత ఒప్పందానికి తాము అనుకూలమని, రాజీ అంశాలు రెండు దేశాలకు ఉపయుక్తంగా ఉండాలని పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్​నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్లు చెప్పారు.తొలుత పుతిన్‌తో ట్రంప్ చర్చించిన అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడారు.

Read Also: Beating Retreat: సీజ్‌ఫైర్ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.