జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ

Trump: అమెరికా విద్యాశాఖను మూసివేసేందుకు ట్రంప్ అడుగులు!

Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల కోతలు పెడుతోన్న ఆయన.. ప్రస్తుతం దానిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.

అమెరికా విద్యాశాఖను మూసివేసేందుకు ట్రంప్

అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా అసాధ్యమే

విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుతోన్న సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలి అని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌ను ఉద్దేశిస్తూ ఉన్న వైట్‌హౌస్‌ ఫ్యాక్ట్‌షీట్‌ను అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా దానిని మూసివేయడం దాదాపు అసాధ్యమే. అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే.

విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు

దానిలోభాగంగా ఆ శాఖలో లోని సిబ్బందిలో సగం మందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నామని గతంలో ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మాన్‌ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు. ట్రంప్‌ నాకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేసేందుకు మేం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించి ఉన్నవారిపై కత్తెరవేయడం కిందికే వస్తుంది అని లిండా ఇటీవల పేర్కొన్నారు. విద్యాశాఖను తొలగించి, దానిని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెప్పారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీవిరమణ చేయడానికి ముందుకొచ్చారు.

Related Posts
Elon Musk: ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్
ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టెస్లా స్టాక్ విలువ పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద 82 శాతం వృద్ధి Read more

రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు
Rajahmundry to Delhi.. Start of flight service

రాజమండ్రి: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌లు ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ పరిణామానికి ముందు, ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి తొలి Read more

ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు చంద్రబాబు కూటమి Read more

తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటినుండి అంటే?
తెలంగాణలో ఈ నెల 10 నుండి ఒంటిపూట బడులు – విద్యా శాఖ కీలక నిర్ణయం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభానికి ముందే ఎండలు భయపెట్టేలా మారాయి. ఈ తరుణంలో విద్యార్థుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *