స్వీయ బహిష్కరణ చేసుకున్న వారికీ ట్రంప్ బిగ్ ఆఫర్

Trump : ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న ట్రంప్‌

Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో సంస్కరణలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 20 నుంచి 25 శాతం సిబ్బందికి లే ఆఫ్‌లు ఇవ్వనున్నట్లు యూఎస్‌ ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారులు వెల్లడించారు. వీరిలో ముందుగా పౌర హక్కుల కార్యాలయ ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలిపారు. ఈమేరకు సిబ్బందికి మెయిల్స్‌ వెళ్లాయన్నారు.

Advertisements
ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత

పౌర హక్కుల కార్యాలయం నుంచి 75శాతం మందిని

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు యూఎస్‌ ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమయ్యింది. దీని ఫలితంగా రెవెన్యూ విభాగానికి చెందిన బహుళ కార్యాలయాలు, ఉద్యోగాల్లోని సిబ్బందిపై వేటు పడనుంది అని రెవెన్యూ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు. పౌర హక్కుల కార్యాలయం నుంచి 75శాతం మందిని తొలగిస్తామని.. మిగిలిన ఉద్యోగులను ప్రత్యేక కార్యాలయం కిందకు మారుస్తామని.. దశలవారీగా తొలగింపులు జరుగుతాయని అందులో తెలిపారు. కాగా ఫెడరల్ వర్క్‌ఫోర్స్ నుంచి ఇప్పటికే రెండు లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.

కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు

ప్రభుత్వ ఉద్యోగాల కోతల్లో భాగంగా ట్రంప్‌ యంత్రాంగం ఇటీవల అక్కడి ఆరోగ్య విభాగంపై కొరడా ఝలిపించింది. ఇందులోభాగంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ ఇటీవల ప్రకటించారు. తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతుందన్నారు. కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగాల తొలగింపునకు ట్రంప్‌ సర్కారు బైఅవుట్‌ను అస్త్రంగా చేసుకుంది. ఈమేరకు ఒక ఈమెయిల్‌ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.

Related Posts
సత్తుపల్లి శ్రీ చైతన్య టెక్నో కొరకులంలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
Science Day celebrations

ఘనంగా సైన్స్ డే వేడుకలు ! సత్తుపల్లి శ్రీ చైతన్య టెక్నో కొరకులం విద్యాలయంలో సైన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా Read more

రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి
kishan reddy hydraa

మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, Read more

ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్..
first phase of polling is going on in Jharkhand

న్యూఢిల్లీ: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత పోలింగ్‌ కొనసాగుతుంది. బుధవారం ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ Read more

హైదరాబాద్‌లో పావురాల రేసింగ్ పోటీలు!
హైదరాబాద్ లో పావురాల రేసింగ్ పోటీలు!1

హైదరాబాదులో పావురం క్రీడలు, ముఖ్యంగా పావురం రేసింగ్, పెద్దగా ప్రాచుర్యం పొందాయి. ఈ రేసింగ్‌లో పక్షులను వారి ఇంటి నుండి వంద కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి, అక్కడి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×