అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యోదంతానికి కు సంబంధించిన ప్రభుత్వ రహస్య పత్రాలన్నింటినీ కూడా బయటపెట్టారు. వైట్‌హౌస్‌లోని తన ఛాంబర్‌లో కొద్దిసేపటి కిందటే వాటిని స్వయానా విడుదల చేశారు. ఇందులో ఎలాంటి సవరణలు కూడా చేయలేదు. ఫలితంగా- జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతంపై ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటూ వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు యధాతథంగా వెలుగులోకి వచ్చినట్టయింది. తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు డొనాల్డ్ ట్రంప్. పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాన్ ఎఫ్ కెన్నెడీ, ఆయన సోదరుడు, అప్పటి అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ హత్యలకు సంబంధించిన రహస్య పత్రాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకుని రావాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ వినిపిస్తూ వస్తోంది అమెరికాలో.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై హామీ సైతం ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. తాను ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే వాటిని విడుదల చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానంటూ పలు ర్యాలీల్లో స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ హత్యోదంతాలకు సంబంధించిన ప్రభుత్వ డాక్యుమెంట్లను సంపూర్ణంగా బయటపెట్టడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ జనవరిలోనే అంటే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే సంతకం చేశారు. తాజాగా వాటిని విడుదల చేశారు.
బయటపెట్టిన రహస్య పత్రాలు
అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యోదంతానికి కు సంబంధించిన ప్రభుత్వ రహస్య పత్రాలన్నింటినీ కూడా బయటపెట్టారు. వైట్‌హౌస్‌లోని తన ఛాంబర్‌లో కొద్దిసేపటి కిందటే వాటిని స్వయానా విడుదల చేశారు. 80,000 పేజీల డాక్యుమెంట్స్ ఇవి. ఇందులో ఎలాంటి సవరణలు కూడా చేయలేదు. ఫలితంగా- జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతంపై ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటూ వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు యధాతథంగా వెలుగులోకి వచ్చినట్టయింది. తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు డొనాల్డ్ ట్రంప్.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో హత్యకు గురైన కెన్నడీ
ఇదొక చారిత్రాత్మక సందర్భంగా అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ కొత్త యుగానికి నాంది పలికారని వ్యాఖ్యానించారు. కెన్నడీ హత్య ఫైళ్లల్లో ఎలాంటి సవరణలు లేకుండా విడుదల చేశామని, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. 1963 నవంబర్ 22వ తేదీన టెక్సాస్‌లోని డల్లాస్‌లో హత్యకు గురయ్యారు జాన్ ఎఫ్ కెన్నడీ. కాన్వాయ్‌లో ప్రయాణిస్తోన్న సమయంలో లీ హార్వీ ఒస్వాల్డ్ అనే షార్ప్ షూటర్ ఈ హత్యకు పాల్పడ్డాడు. అప్పటి సోవియట్ యూనియన్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలొచ్చాయి. కెన్నడీ హత్య జరగడానికి నాలుగు నెలల ముందే అంటే 1963 జూలైలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టినట్లు తాజా డాక్యుమెంట్లల్లో రికార్డయింది.