పెరుగుతున్న సైబర్‌ మోసాలతో ఖజానా ఖాళీ

Cyber Crime: పెరుగుతున్న సైబర్‌ మోసాలతో ఖజానా ఖాళీ

గుడి మల్కాపూర్‌లో ఉంటున్న ప్రముఖ వైద్యులు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. కేటుగాళ్లు ఫోన్‌చేసి మీ ఆధార్, ఫోన్ నంబర్లతో మనీలాండరింగ్ జరిగిందని సీబీఐ అధికారులమంటూ మాయమాటలు చెప్పారు. ‘మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అనగానే ఆయన వణికిపోయారు. దీంతో వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 కోట్లు మళ్లించారు. మోసపోయానని గ్రహించి 20 రోజులయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘న్యూడ్‌ వీడియో’ ఉచ్చులో..
ప్రభుత్వంలో ఉన్నత హోదాలో పదవీ విరమణ చేసిన అధికారి ‘న్యూడ్‌ వీడియో’ ఉచ్చులో చిక్కి రూ.2.5 కోట్లు నష్టపోయారు. అపార అనుభవం ఉండి మీరెలా బోల్తాపడ్డారని అడిగితే, సైబర్‌ మోసాలు తెలియవని, కేటుగాళ్ల బెదిరింపులు హిప్నటైజ్‌ చేసినట్టు ఉంటాయని అనుభవం ఉన్న వ్యక్తి పంచుకున్నారని సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

పెరుగుతున్న సైబర్‌ మోసాలతో ఖజానా ఖాళీ

సీబీఐ, ఈడీ, ఇన్‌కంటాక్స్..
సామాన్యుల బలహీనతలు అస్త్రంగా చేసుకొని మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు, సీబీఐ, ఈడీ, ఇన్‌కంటాక్స్, కస్టమ్స్‌ అనగానే కేసుల్లో ఇరుక్కుంటామని భయపడుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌లో ఈ ఏడాది 650 కేసులు నమోదయ్యాయి. వీరిలో 100 మంది విశ్రాంత ఉద్యోగులు, 200 మంది ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులేనని అంచనా.
సైబర్ నేరాలపై అవగాహన లేక
పోలీసులు ప్రశ్నించినపుడు 90 శాతం మంది సైబర్‌ నేరాలపై అవగాహన లేదని అంగీకరిస్తున్నారు. రోజూ పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో సైబర్‌ మోసాలపై వస్తున్న వార్తలు చూడట్లేదా! డిజిటల్‌ అరెస్ట్‌పై స్వయంగా ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ విన్నారా! అని 20 మంది బాధితులను ప్రశ్నిస్తే 16 మంది అంత సమయం లేదని చెప్పారని ఒక ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.
డేటా చోరీ చేసి మోసం చేస్తున్నారు..
పౌరుల సెల్‌ఫోన్‌ నెంబర్, ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలు మాయగాళ్లు చేతికి చేరాయి. ఫోన్‌కాల్‌లో తమ ఆధార్, ఇంటి చిరునామా చెప్పగానే బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, వారి విద్యార్హతలు వివరిస్తుంటే అట్నుంచి వచ్చే మాటలు నమ్ముతున్నారు. తమ డేటా చోరీ చేసి మోసం చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.
ఫోన్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి
ఉన్నత విద్యావంతులు, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో గుర్తింపు పొందినవారు కూడా సైబర్‌ మోసాల బారినపడటం ఆందోళన కలిగిస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ తెలిపారు. తమ చుట్టూ జరుగుతున్న అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. రోజూ పత్రికలు చదవటం, టీవీ ఛానళ్లను వీక్షించడం చేయాలని సూచించారు. తెలియని సంస్థలు, వ్యక్తుల పేరిట ఫోన్‌ చేసి బెదిరించగానే భయపడొద్దని, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వాలని తెలిపారు. మోసపోయినట్టు గ్రహిస్తే గంట వ్యవధిలో 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Related Posts
మహారాష్ట్రలో త్వరలో మత మార్పిడుల నిరోధక చట్టం
nitesh rana

మహారాష్ట్రలో మత మార్పిడులను నిరోధించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వర్గాల మధ్య చిచ్చు Read more

దేశ చరిత్రలో తొలిసారిగా రూ.50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 Read more

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, ఆపిల్ పై CCI దర్యాప్తు
apps

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ప్రస్తుతం పెద్ద సాంకేతిక సంస్థలపై తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, మరియు ఆపిల్ Read more

టీచర్ ను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు
టీచర్ ను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిల్సాపూర్ లో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ టీచర్‌ను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. యూట్యూబ్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *