Nani: డైరెక్టర్ చొరవతోనే ది ప్యారడైజ్‌ సినిమా :నాని

Nani: డైరెక్టర్ చొరవతోనే ది ప్యారడైజ్‌ సినిమా :నాని

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈమూవీతోపాటు మరోవైపు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. దసరా సినిమాతో నాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో నాని ఊహించని లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.అయితే ఈ మూవీలో తన బాడీ ట్రాన్సఫర్మేషన్ (శరీరాకృతి) గురించి నాని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisements

శ్రీకాంత్ విజన్​

సినిమాల్లో నటించే పాత్రలకు శరీరాకృతి అవసరం లేదని గతంలో నమ్మేవాడినని నాని చెప్పారు. కానీ ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను బాడీ ట్రాన్సఫర్మేషన్​కు ఒప్పించాడని తెలిపారు. శ్రీకాంత్ విజన్​తో ప్రేరణ పొందానని, అందుకే బాడీ పెంచుతున్నానని వెల్లడించారు.’పాత్రకు అవసరమైన శిక్షణకు అలవాటుపడ్డాను. శ్రీకాంత్ చాలా తెలివిగల వ్యక్తి.నేను శరీరాకృతి మార్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఓదెల నన్ను ఒప్పించి వ్యాయామం వంటివి చేయిస్తున్నారు. వర్కౌట్ చేసి బాడీ ట్రాన్స్​ఫర్మేషన్ మార్చుకునేలా నన్ను ఒప్పించాడు.మన సామర్థ్యాన్ని,టాలెంట్ నిజంగా ఎవరు గుర్తిస్తారు? ఏదైనా చేయమని ఎవరు అడుగుతారు? మనకు అవసరమైన వ్యక్తులు తప్ప అని తెలిపారు,త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

hq720 (8)

మాస్​ లుక్‌

‘ది ప్యారడైజ్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘రాస్టేట్‌మెంట్‌’ పేరుతో ఓ వీడియో రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్​లో టాప్ ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రెండు జడలతో మాస్​ లుక్‌లో నాని కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీకొడుకుల అనుబంధం కథకు కీలకంగా నిలవనున్నట్లు సమాచారం.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ మూవీని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రం ఫ్యాన్స్‌కి పండుగ‌గా ఉంటుంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుందని టాక్.ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Posts
Goutham: నటనలో రానిస్తున్నమహేష్ బాబు వారసుడు గౌతమ్
Goutham: నటనలో రానిస్తున్నమహేష్ బాబు వారసుడు గౌతమ్

మహేశ్ వార‌సుడి తొలి ప్ర‌య‌త్నం… గౌత‌మ్‌ న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఫిదా! సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌత‌మ్‌ ఘట్ట‌మ‌నేని తన చదువును పూర్తిచేసుకొని ప్రస్తుతం నటనపై Read more

Jetwani: :కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ
కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని… ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముంబై నటి జెత్వానీ కోరారు. Read more

కోలీవుడ్ హీరోలకు ఎందుకీ విరక్తి..?
kollywood

గతంలో ప్రతి హీరో పేరుకు ఓ ప్రత్యేకమైన స్టార్ ట్యాగ్ ఉండేది.హీరోల క్రేజ్‌ను చెప్పేలా "సూపర్ స్టార్","మెగా స్టార్", "యంగ్ టైగర్" వంటి ట్యాగ్‌లు వారి పేర్లకు Read more

తెలుగులో చావా వచ్చే అవకాశం లేదా?
తెలుగులో చావా వచ్చే అవకాశం లేదా?

హిందీ ప్రేక్షకుల ముందుకు గత వారం వచ్చిన 'ఛావా' మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విక్కీ కౌశల్ - రష్మిక మందన్నా జోడిగా నటించిన ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×