క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌

క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పించారు. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ను విమర్శించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నెగిటివ్‌గా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

The hero who apologized was Vishwak Sen

జరిగిన ఘటనకు క్షమాపణలు

హీరో విశ్వక్ సేన్‌తో పాటు దర్శకుడు మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పారు. పృథ్వి మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని, ఆయన మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లామని, ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు. పృథ్వి చేసిన దానికి తమ సినిమాను బ్యాన్ చేయాలనడం సరైంది కాదంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమాకు మీ అందరి సపోర్టు కావాలని విశ్వక్ సేన్ కోరారు. విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

హద్దులు దాటి మాట్లాడిన పృథ్వి

దీంతో బాక్సాఫీస్ వద్ద ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా వేదికపై నుంచి కూడా పవన్ కల్యాణ్ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సినిమాపై కూడా వైసీపీ శ్రేణులు గట్టిగానే ఫైట్ చేశాయి.తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో చిరంజీవి జై జనసేన అంటూ అక్కడకు వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే నటుడు పృథ్వి సినిమా హద్దులు దాటి మాట్లాడారు. పృథ్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు ‘లైలా’ సినిమాను ఇరకాటంలోకి నెట్టింది. పృథ్వి గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో ‘లైలా’ సినిమా ఈవెంట్‌లో వైసీపీని చులకనగా చేసి మాట్లాడారు.
పృథ్వి మాట్లాడుతూ..ఇందులో నేను మేక‌ల స‌త్తిగా చేశాన‌ని తెలిపారు. అయితే మేక‌లు ఎన్ని ఉన్నాయ‌ని షాట్ మ‌ధ్య‌లో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. షాకింగ్ ఎంటో కానీ సినిమా చివ‌రిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు.

Related Posts
Tenth board exams 2025:టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
టెన్త్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్! ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులో

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 17న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు Read more

ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
Employee health insurance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. Read more

YS Sunitha: గవర్నర్ తో సునీత భేటీ
YS Sunitha: గవర్నర్ తో సునీత భేటీ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని వైఎస్‌ Read more

ఇక నుండి మీ సేవ కేంద్రాల్లోను రేషన్ కార్డుల దరఖాస్తులు
meeseva

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై లబ్ధిదారులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో రేషన్ Read more