CM Revant : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందు సీఎం పర్యటన దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పర్యటన సందర్భంగా నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు సమాచారం. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. అయితే పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also : చౌటుప్పల్ జోగిని హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి.. ఏర్పాట్లలో అధికారులు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఖమ్మం నగరంలోని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, వెలుగుమట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యటనలోగా పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :