New Course: తెలంగాణ ఇంటర్మీడియట్​లో కొత్త కోర్సు – వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

Follow Us: Google News Daily Hunt
New Course
New Course
FONT SIZE
GET APP

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో ఒక కీలక మార్పును చేపట్టింది. ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న MEC (Maths, Economics, Commerce) గ్రూప్ స్థానంలో ACE (Accounts, Commerce, Economics) అనే కొత్త గ్రూప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఈసీ గ్రూప్​ కనుమరుగు కానుంది. ఎంఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రెండో ఏడాది యథావిధిగా చదువుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కామర్స్ చదివే విద్యార్థులకు లెక్కల (Mathematics) పట్ల కొంత ఆందోళన ఉంటుంది. దీనిని గమనించిన బోర్డు, గణితం స్థానంలో ‘అకౌంట్స్’ (Accounts) ను ఒక ప్రధాన సబ్జెక్టుగా చేర్చి ACE గ్రూప్‌ను రూపొందించింది.

Read Also: Delimitation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు

New Course
New Course

New Course: సైన్స్​, గణితానికి సంబంధం లేకుండా ఏసీఈ కోర్సు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉమ్మడి మెదక్​ జిల్లాలోని జూనియర్​ కళాశాలలు, గురుకులాలు, కస్తూర్బాలు ఆదర్శ పాఠశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్​లో ఎంపీసీ, బైపీసీ, హెచ్​ఈసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయి. వీటికి భిన్నంగా సైన్స్​, గణితానికి సంబంధం లేకుండా విద్యార్థులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ బోర్డుకు వినతులు వెల్లువెత్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు