Telangana: హైడ్రా ప్రత్యేక కార్యక్రమం

Read Time:  1 min
Telangana: హైడ్రా ప్రత్యేక కార్యక్రమం
FONT SIZE
GET APP

తెలంగాణ (Telangana) ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ( హైడ్రా)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను నియమించడంతోపాటు హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

ఒక గంట పాటు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం

హైడ్రా.. పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటివరకు ప్రతీ సోమ‌వారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హైడ్రా ఇప్పుడు మ‌రో కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతీ శ‌నివారం రోజున ఫోన్‌ ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల‌ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు.ఈ శ‌నివారం (ఫిబ్రవరి 7వ తేదీ) నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు బుధ‌వారం రోజున హైడ్రా ఒక ప్రక‌ట‌న‌లో వెల్లడించింది.

Telangana: Hydra special program
Telangana: Hydra special program

సెల‌వు రోజులు కాకుండా ప్రతీ శ‌నివారం రోజున మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 1 గంటల వ‌ర‌కు ఒక గంట పాటు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ ఔట‌ర్ రింగు రోడ్ ప‌రిధిలో ఉన్న న‌గ‌ర ప్రజ‌లు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు చేయ‌వ‌చ్చని తెలిపింది. ఇందుకోసం 040-29565750, 040-29565759 రెండు ఫోన్ నంబ‌ర్లను ఏర్పాటు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.