Shivampet Polytechnic: ఆగని విద్యార్థుల నిరసనలు

Follow Us: Google News Daily Hunt
Shivampet Polytechnic students protest
Shivampet Polytechnic students protest
FONT SIZE
GET APP

Shivampet Polytechnic:ఐదవ రోజు తరగతులు బహిష్కరణ, సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల నిరసనల పర్వం గురువారం కొనసాగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నది.

Shivampet Polytechnic students protest

పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, వృత్తి విద్యా సంస్థలను యంగ్ ఇండియా స్కిల్క్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలంటూ ఈ నెల 17వ తేదీ నుండి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఐదు రోజులుగా విద్యార్థినీ, విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఆవరణలో మండెటెండలో నేలపై కూర్చుని చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

Read also: Toilets : టాయిలెట్స్ కడిగిన మంత్రి జూపల్లి

Shivampet Polytechnic students protest

Shivampet Polytechnic:ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

ప్రభుత్వ ప్రతిపాదన డిప్లొమా ఇంజనీరింగ్ ప్రమాణాలను నీరుగారుస్తుందని ఆరోపిం చారు. మూడేళ్ల కోర్ టెక్నికల్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈలను సాధారణ నైపుణ్యాభివృద్ధిలో విలీనం చేసేందుకు నిర్ణయించడాన్ని వ్యతిరేకించారు. ఆయా కోర్సుల విలీనం ద్వారా అధికారిక సాంకేతిక విద్య దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలను విస్తృత కార్మిక, శిక్షణ పరిధిలోకి తరలించడం వల్ల కోర్సు నిర్మాణాలు, పరీక్షా విధానాలు. వృత్తి. ఉన్నత విద్యా అర్హతలలో గణీయమైన మార్పులు చోటు చేసుకుం టాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు, సిబ్బంది విద్యార్థుల ఆందోళనకు సం ఘీభావం ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల నిరసన చేస్తుండటంతో జోగిపేట సీఐ అనిల్ కుమార్ పుల్కల్ ఎస్ఐ నలా విశ్వజన్లు పోలీసు సిబ్బందితో కలిసి సహరా కాశారు.

Shivampet Polytechnic students protest

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు