Papannapet Urea Server Issue: యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రమైన పాపన్నపేట సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులోకి రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే సర్వర్ సమస్య తలెత్తడంతో సుమారు రెండు గంటల పాటు పంపిణీకి అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక నిరీక్షించిన పలువురు రైతులు ఎండలో నిలబడలేక తమ చెప్పులను క్యూలో పెట్టి వంతు స్థానాలను కాపాడుకున్న దృశ్యం అక్కడ కనిపించింది.
Read Also : KCR Resign : కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్ తట్టుకోగలడా ? కేటీఆర్ సూటి ప్రశ్న

Papannapet Urea Server Issue: అందుబాటులో ఉన్నా పంపిణీకి సాంకేతిక ఆటంకం
సొసైటీలో సుమారు 1100 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా పంపిణీలో జాప్యం ఏర్పడింది. దీంతో యూరియా కోసం వచ్చిన రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. యూరియా ఉంది.. కానీ సర్వర్ సహకరించలేదు! అన్నట్లుగా పరిస్థితి మారింది.ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాజును వివరణ కోరగా సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సమస్యను పరిష్కరించి యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.యూరియా కోసం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమకు సర్వర్ సమస్యలు మరింత భారంగామారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :