Murasu Cyclone : పలు జిల్లాలో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్

Follow Us: Google News Daily Hunt
Arnab Cyclone
Arnab Cyclone
FONT SIZE
GET APP

Murasu Cyclone : మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం (BDR), ఖమ్మం (KMM) జిల్లాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ఖమ్మం, ములుగు (MLG), మహబూబాబాద్ (MHBD) జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించే అవకాశముందని అంచనా వేశారు. వరదనీరు ఒక్కసారిగా ప్రవహించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున వాగులు, వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read Also : పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోండి – మంత్రి తుమ్మల

ఏపీలోనూ భారీ వర్ష సూచన.. ఉభయ గోదావరి జిల్లాలకు అలర్ట్

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మురసు తుఫాన్ ప్రభావం కొనసాగనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కృష్ణా, పల్నాడు (PLN), బాపట్ల (BPTL), నెల్లూరు (NLR) జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోని వరంగల్ (WGL), నల్గొండ (NLG), సూర్యాపేట (SRPT) జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు, రహదారులపై నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు