Scene Movie Pre Release Event: నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’, దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామరస్ అండ్ టాలెంటెడ్ నటి నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య పాల్గొని నటి నజ్రియా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Read Also : Actress Tabu Birthday: నటి టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జాకీ ష్రాఫ్

Scene Movie Pre Release Event: మూడుసార్లు తిరస్కరించింది.. సూర్య
వేదికపై సూర్య మాట్లాడుతూ, గతంలో తన మూడు సినిమాల్లో నజ్రియాను కథానాయికగా సంప్రదించగా ఆమె తిరస్కరించినట్లు వెల్లడించారు. “ఒక మంచి నటితో కలిసి పనిచేయాలని నేను ఎప్పటినుంచో అనుకున్నాను. దీనికోసం మేము గతంలో మూడుసార్లు ఆమెను అడిగాం, కానీ కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పారు. ఇది మా నాలుగో ప్రయత్నం, ఇప్పుడు ఆమె ఓకే చెప్పారు. గత 12 ఏళ్లలో ఎంతోమంది దర్శకులు, నటుల నుంచి వచ్చిన ఆఫర్లను ఆమె వద్దనుకున్నారు. చివరకు మా సినిమాను అంగీకరించి ఇందులో భాగమైనందుకు నజ్రియాకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అని సూర్య తెలిపారు.

సూర్య సార్ వల్లే ఓకే చేశా: నటి నజ్రియా
సూర్య వ్యాఖ్యలపై హీరోయిన్ నజ్రియా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత నేను మళ్లీ తమిళ సినిమాలో నటిస్తున్నాను. దీనికి ప్రధాన కారణం సూర్య సార్. గతంలో వేర్వేరు కారణాలు, డేట్స్ కుదరకపోవడం వల్ల ఆయనతో నటించే అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఒక మంచి ప్రాజెక్ట్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది” అని నజ్రియా పేర్కొన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :