TRS Kavitha : తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ వేదికగా జరిగిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న కఠిన సవాళ్లను, జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ సభాముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి తప్పు చేయని తెలంగాణ ఆడబిడ్డగా నిలబడిన తనకు CBI, ED దర్యాప్తు సంస్థల ద్వారా నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంతటి ఒత్తిళ్లకు గురిచేసినా, ఇబ్బందులకు గురిచేసినా తాను అధైర్యపడకుండా పోరాడానని చెప్పారు. అంతిమంగా న్యాయస్థానమే తనకు క్లీన్ చిట్ ఇస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని తీర్పు చెప్పిందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read Also : విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాటలు…

అన్యాయంగా బయటకు పంపినా వెనకడుగు వేయను: పొంగిపొర్లిన ఆవేదన
ఎంతో నిబద్ధతతో పనిచేసిన తనను సొంత పార్టీ (BRS) నుంచే అన్యాయంగా బయటకు పంపించారని, ఆ సమయంలో తీవ్రమైన మనోవేదనకు గురయ్యానని కవిత వెల్లడించారు. “నా గుండెల్లో ఉన్న భరించలేని బాధతోనే ఈ రోజు మీ ముందు ఏడుస్తున్నా తప్ప, నన్ను ఎవరో బలహీనురాలిగానో లేక పిరికిదానిగానో భావించవద్దు” అని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎంతటి కుట్రలు పన్నినా, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం సేవ చేసేందుకు మళ్లీ ప్రజల ముందే నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ రక్షణ సేన ద్వారా కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతానని ధీమా వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :