📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త

Author Icon By Anusha
Updated: May 4, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కు చెందిన మమతకు, జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన ఆవుదుర్తి మహేందర్ కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు దీంతో భర్త మహేందర్ మమతను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా వరకట్నం తీసుకురావాలంటూ ఇబ్బందులకు గురిచేసేవాడు.పెళ్లి సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని కూడా మమతను ఇబ్బందులు పెడుతున్న మహేందర్ తాగుడుకు బానిసై అప్పుల పాలయ్యాడు. భర్తతో పాటు అత్తింటి వారి వేధింపులను తట్టుకుంటూ జీవనం సాగిస్తున్న మమత గత కొంతకాలంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తోంది. తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చిన జీతం డబ్బులు కూడా భర్తకు ఇచ్చేది మమత అయితే అప్పుల ఊబిలో చిక్కుకున్న మహేందర్ మమతను హింసిస్తుండడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్ లో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఆత్మహత్య

అప్పుడు భార్యను బాగా చూసుకుంటానని చెప్పిన మహేందర్ మమతను తీసుకుని కరీంనగర్‌లోని అద్దె ఇంటికి వెళ్లాడు. అయితే, తాను చేసిన అప్పులు తీర్చేందుకు మమత మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు ఇవ్వాలని ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అయితే తన పుట్టినింటి వారు ఇచ్చిన పుస్తెల తాడు ఇవ్వనని మమత తేల్చి చెప్పడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మహేందర్ తన భార్య మమతను ఏప్రిల్ 26న వేములవాడలోని రాజన్న, నల్లగొండ నృసింహ స్వామి ఆలయాలకు తీసుకెళ్లి దైవ దర్శనం చేయించాడు. అక్కడి నుండి కొడిమ్యాలలోని ఇంటికి తీసుకెళ్లిన మహేందర్ నైలాన్ తాడుతో మమత మెడకు ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుప హుక్కుకు తగిలించి ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.మమత మెడలో ఉన్న పుస్తెల తాడును తీసుకుని వెల్లిన మహేందర్ గంగాధరలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకున్నాడు.

కేసు

మమత పుట్టినింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆవుదుర్తి మహేందర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా మహేందర్ కుటుంబ సభ్యులు వజ్రవ్వ, లక్ష్మణ్, అనిల్, వెంకటష్ లపై కూడా కేసు నమోదు చేశామని డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.

Read Also: Naa Anveshana: అన్వేష్ పై పోలీస్ కేసు నమోదు ఏం జరిగిందంటే?

#DomesticViolence #DowryDeath #JusticeForHer #StopDowrySystem #ViolenceAgainstWomen #WomensRights Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.