సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారా నగర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత 66 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించగా ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉన్నందున మండల జేఏసీ ఆధ్వర్యంలో నల్లవల్లి, ప్యారా నగర్, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, గుమ్మడిదల, మంబాపూర్, గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా మండల తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఆర్డిఓ, అడిషనల్ ఎస్పీ, డి.ఎస్.పి, గుమ్మడిదల ఎస్సై, జిన్నారం ఎస్సై, సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నారు. మండల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇక్కడ నిర్మించబోయే డంపింగ్ యార్డ్ ను విరమించుకోవాలని లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
READ ALSO: Telangana: తెలంగాణలో భూకంప సూచనలు