HYD : హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హెచ్-సిటీ’ (H-City) ప్రాజెక్టులో భాగంగా సౌత్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులలో ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ. 242.72 కోట్ల వ్యయంతో మూడు భారీ రోడ్డు మౌలిక వసతుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టును ప్రముఖ ‘కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్’ (KNR Constructions) సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టే ఈ పనులను రాబోయే 24 నెలల్లో పూర్తి చేయాలని కాలపరిమితి విధించారు.
Read Also : మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్?

మూడు కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులు: మహేశ్వరం, బాలాపూర్ మార్గాల్లో మారనున్న రూపురేఖలు
ఈ ప్రాజెక్టు ద్వారా పాతబస్తీ, దక్షిన హైదరాబాద్‌లోని అతిముఖ్యమైన ప్రధాన జంక్షన్లలో రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రధానంగా ఒవైసీ ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్‌ను నిర్మించడంతో పాటు, హఫీజ్‌బాబా నగర్ నుంచి బాలాపూర్-చర్చ్ రోడ్ వరకు ఆరు లేన్ల ‘టూ-వే గ్రేడ్ సెపరేటర్’ ను చేపడతారు. అలాగే బండ్లగూడ-ఎర్రకుంట క్రాస్‌రోడ్ వద్ద ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, శ్రీశైలం హైవే వైపు ప్రయాణించే వాహనదారులకు సులభతరమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :