WhatsApp New Features:ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం ఒక భారీ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు చాట్ బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ (Android) లేదా ఐక్లౌడ్ (iOS) పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, ఇకపై ఆ అవసరం లేకుండా వాట్సప్ తన సొంత క్లౌడ్ స్టోరేజీ సిస్టమ్‌ను పరిచయం చేయబోతోంది.
Read Also:Emergency Alert System:దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫోన్లకు వచ్చిన అలర్ట్ మేసేజ్

2GB వరకు ఉచిత స్టోరేజీ
ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతి యూజర్‌కు సుమారు 2జీబీ (2GB) వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీని వాట్సప్ అందించనుంది. దీనివల్ల గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజీ నిండిపోయి ఇబ్బంది పడేవారికి పెద్ద ఉపశమనం కలగనుంది. కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు బ్యాకప్ చేసుకునే వారికి ఈ 2జీబీ స్టోరేజీ సరిపోతుంది.
భారీ ఫైల్స్ కోసం 50GB ప్లాన్
ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉండేవారి కోసం వాట్సప్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మీడియా ఫైల్స్ ఎక్కువగా ఉన్న వినియోగదారుల కోసం 50జీబీ (50GB) స్టోరేజీ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది పెయిడ్ వెర్షన్ లేదా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
WhatsApp New Features: ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత
సొంత స్టోరేజీ సిస్టమ్ అయినప్పటికీ, భద్రత విషయంలో వాట్సప్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ బ్యాకప్ ప్రక్రియ అంతా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) ద్వారా సురక్షితంగా ఉంటుంది. అంటే, మీ చాట్ బ్యాకప్‌లను వాట్సప్ లేదా మరే ఇతర మూడవ పక్షం చదివే అవకాశం ఉండదు. డేటా మైగ్రేషన్ మరియు రీస్టోరింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: