Whatsapp : ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలకు, సైబర్ స్కామ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఒక సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తెలియని నంబర్ల (Unknown Numbers) నుండి వచ్చే మెసేజ్‌ల ద్వారా వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా కాపాడటమే ఈ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా యూజర్ ఒక అన్నోన్ నంబరుకు మెసేజ్ చేయడానికి ప్రయత్నించినా లేదా అవతలి వైపు నుండి మెసేజ్ వచ్చినా, వాట్సాప్ వెంటనే ఆ నంబర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఈ ముందస్తు హెచ్చరికల వల్ల వినియోగదారులు సైబర్ దాడులు, ఆర్థిక మోసాల బారిన పడకుండా తమను తాము రక్షించుకునే అవకాశం లభిస్తుంది.
Read Also : అంతరిక్షంలో గులాబీ గ్రహం.. వాతావరణంలో కురుస్తున్న ఉప్పు మేఘాల వర్షం.. శాస్త్రవేత్తలు షాక్!

స్కామర్ల గుట్టు రట్టు.. చాట్ కంటిన్యూ ఆప్షన్!
ఈ అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్ ద్వారా అన్నోన్ నంబర్‌కు సంబంధించిన పూర్తి లొకేషన్ హిస్టరీ మరియు ప్రొఫైల్ వివరాలను వాట్సాప్ స్క్రీన్‌పైనే ప్రదర్శిస్తుంది. సదరు మొబైల్ నంబర్ ఏ దేశంలో (Country) రిజిస్టర్ అయింది, ఆ నంబర్‌తో మీకు ఏవైనా కామన్ గ్రూప్స్ (Common Groups) ఉన్నాయా లేదా అనే కీలక సమాచారాన్ని ఇది యూజర్లకు చూపిస్తుంది. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత సదరు చాటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాలా (Chat Continue) లేక అక్కడితోనే నిలిపివేయాలా (Cancel) అనే ఆప్షన్లను వాట్సాప్ స్క్రీన్‌పైనే ఇస్తుంది. దీనివల్ల యూజర్లు నంబర్ యొక్క విశ్వసనీయతను గమనించి, ఆలోచించి చాట్ చేస్తారని, ఫలితంగా ఆన్‌లైన్ మోసాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని వాట్సాప్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :