Mivi One Smartphone Launch: భారతదేశంలో ప్రముఖ స్వదేశీ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ‘మివి’ (Mivi) మొబైల్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. క్వాల్‌కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని తమ తొలి స్మార్ట్‌ఫోన్ ‘మివి వన్’ను సెప్టెంబర్ 24, 2026న ఫ్లిప్‌కార్ట్ వేదికగా ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని స్వంత ప్లాంట్‌లో మేక్ ఇన్ ఇండియా చొరవతో తయారవుతున్న ఈ ఫోన్, ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన స్నాప్‌డ్రాగన్ 5G చిప్‌సెట్‌తో రానుంది. ఆడియో రంగంలో ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, స్పీకర్లతో విపరీతమైన ఆదరణ పొందిన మివి, దశాబ్ద కాలపు ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ అనుభవంతో పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌లోకి తెస్తోంది.
Read Also : అడోబ్ సీఈవోగా అనిల్ చక్రవర్తి
భారతీయ తయారీ మరియు ప్రముఖుల స్పందన
మివి వన్ స్మార్ట్‌ఫోన్ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ మరియు సరసమైన ధరలతో నయా ట్రెండ్ సృష్టించనుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశం నుండి ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీని నిర్మించడమే తమ ప్రధాన ఆశయమని మివి సహ వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కందుల తెలిపారు. కేవలం వేరొక కేటగిరీని జోడించడం కాకుండా భారతీయ యువత ఆకాంక్షలకు తగ్గట్లుగా విభిన్నమైన ప్రాధాన్యతలతో ఈ ఫోన్‌ను రూపొందించామని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హిమాన్షు టాండన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు లాజిస్టిక్స్, పంపిణీ వ్యవస్థ ద్వారా మివి వన్‌ను చేరవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ ముకుంద్ కేడియా హర్షం వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :