ChatGPT Down:గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్.. స్తంభించిన ఏఐ సేవలు, ఇబ్బందుల్లో యూజర్లు!

Follow Us: Google News Daily Hunt
ChatGPT Down OpenAI Global Server Outage
ChatGPT Down OpenAI Global Server Outage
FONT SIZE
GET APP

ChatGPT Down: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా వెబ్, మొబైల్ యాప్స్ సేవలు నిలిచిపోవడంతో గ్లోబల్‌గా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ సర్వీసుల అంతరాయాలను ట్రాక్ చేసే ‘డౌన్‌డిటెక్టర్’ (Downdetector) కథనం ప్రకారం మధ్యాహ్నం 2:54 గంటల నుంచి ప్రధానంగా ఈ సమస్య మొదలైంది.

ప్రభావితమైన సేవలు & సమస్య వివరాలు

ChatGPT Down

ఇది ఏ ఒక్క ప్రాంతానికో లేదా లోకల్ నెట్‌వర్క్‌కో సంబంధించిన సమస్య కాదని, ఓపెన్ఏఐ (OpenAI) గ్లోబల్ సర్వర్లలోనే సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) మొబైల్ యాప్‌లతో పాటు వెబ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా లాగిన్ సమస్యలు తలెత్తాయి. పాత చాట్స్ సెక్షన్ ఓపెన్ కాకపోవడం, డెవలపర్లు ఉపయోగించే API (Application Programming Interface) సర్వీసులు నిలిచిపోవడంతో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, డెవలపర్ల పనులకు ఆటంకం కలిగింది.

ChatGPT Down: ఓపెన్ఏఐ (OpenAI) స్పందన

చాట్‌జీపీటీ సేవల్లో తలెత్తిన గ్లోబల్ అంతరాయంపై మాతృ సంస్థ ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. తమ సర్వర్లలో తలెత్తిన సమస్యను గురుతించామని, దానిపై ఇంజనీరింగ్ టీమ్ ఇప్పటికే పనిచేస్తోందని తెలిపింది.త్వరలోనే సమస్యను పరిష్కరించి సేవులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

Read Also hindi  news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు