Apps Ban : దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ నెట్‌వర్క్‌ను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఫేక్ లోన్ యాప్‌లతో పాటు అనేక మోసపూరిత అప్లికేషన్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3,718 అక్రమ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించి బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ రుణాల పేరిట అధిక వడ్డీలు వసూలు చేస్తూ, బాధితుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
Read Also : జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అదుర్స్

కేంద్రం కఠిన చర్యలు: రూ.11,000 కోట్లు భద్రం
ఈ భారీ సైబర్ వేటలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (CFCFRMS) కీలక పాత్ర పోషించిందని కేంద్రం వెల్లడించింది. 2021లో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా బాధితులు తక్షణమే ఫిర్యాదులు చేసే అవకాశం లభించడమే కాకుండా, సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి నిధులు మళ్లకుండా వేగంగా నిరోధించగలిగారు. దీని ఫలితంగా దాదాపు రూ. 11,000 కోట్ల ప్రజల సొమ్ము సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడగలిగారు. వీటితో పాటు మోసాలకు ఉపయోగిస్తున్న 15.75 లక్షల సిమ్ కార్డులను, 5.77 లక్షల మొబైల్ IMEI నంబర్లను శాశ్వతంగా బ్లాక్ చేసి, అక్రమార్కుల కమ్యూనికేషన్ వ్యవస్థను కేంద్రం సమర్థవంతంగా దెబ్బతీసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :