Apple iPhone Security : చేతిలో అన్‌లాక్ చేసి ఉన్న ఐఫోన్‌ను ఎవరైనా ఒక్కసారిగా లాక్కొని పారిపోతే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ యాప్స్, పాస్‌వర్డ్‌లు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి యాపిల్ సంస్థ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నట్లు గుర్తించిన వెంటనే ఐఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే విధంగా ఈ వ్యవస్థ పనిచేయనుంది.
సెన్సార్లతో దొంగతనం గుర్తింపు
ప్రముఖ టెక్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఐఫోన్‌లో ఉండే యాక్సిలెరోమీటర్ వంటి సెన్సార్ల సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఫోన్‌ను చేతి నుంచి ఒక్కసారిగా లాక్కునే సమయంలో వచ్చే వేగవంతమైన కదలికలను సిస్టమ్ గుర్తిస్తుంది. అసాధారణ కుదుపు లేదా వేగం కనిపించగానే ఫోన్ స్క్రీన్ వెంటనే లాక్ అవుతుంది. దీంతో దొంగ ఫోన్‌ను తెరిచి డేటాను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది.
Read Also : వాట్సప్‌లో సరికొత్త ‘కాంటాక్ట్స్ హబ్’ ఫీచర్

యాపిల్ వాచ్‌తో అదనపు భద్రత
ఈ ఫీచర్‌లో యాపిల్ వాచ్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఐఫోన్, యాపిల్ వాచ్ మధ్య కనెక్షన్‌ను సిస్టమ్ నిరంతరం పరిశీలిస్తుంది. ఫోన్ అన్‌లాక్‌లో ఉన్న సమయంలో వాచ్ ఒక్కసారిగా దూరమైతే లేదా సిగ్నల్ తగ్గిపోతే దాన్ని అనుమానాస్పదంగా గుర్తించి ఫోన్‌ను వెంటనే లాక్ చేస్తుంది. కొత్త ప్రదేశాల్లో లేదా తెలియని వైఫై నెట్‌వర్క్‌లలో ఈ భద్రత మరింత కఠినంగా పనిచేయనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also