TDP Foundation Day.. Chandrababu, Lokesh pay tribute to NTR statue

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్‌ నివాళి

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా జరింది. ఈ వేడుకలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్‌, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేశ్‌ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంతవరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌

రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా..రికార్డులు బద్దలు కొట్టాలన్నా టీడీపీతోనే

మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ..రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.. మొదటి గెలుపు ఓ సంచలనం అని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారాయని అన్నారు. ఇప్పటికీ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయంటే అందు కారణం ఎన్టీఆరే అని కొనియాడారు. తెలుగోడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపింది అన్న ఎన్టీఆర్ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని ఎంతమంది పత్యర్థులు మీదపడినా పసుపు సైన్యం మాత్రం పట్టు విడవకుండా పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘటన మహానేత ఎన్టీఆరే అని దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపింది చంద్రబాబేనని ప్రశంసించారు. మనకు గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ తెలుసుంటూ చమత్కరించారు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్ర వేరని నారా లోకేశ్ అన్నారు.

Related Posts
శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి
Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా Read more

న్యూయార్క్ సిటీతో పోటీ – సీఎం రేవంత్
cm revanth

హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తమకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ , బెంగుళూర్ కాదని న్యూయార్క్ సిటీతోనే పోటీ అని సీఎం రేవంత్ అన్నారు. తాజాగా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' Read more

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ
అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు Read more

నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *