అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావేశానంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గతంలో 131 సంస్థలకు భూమి కేటాయించామని,వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.అంతేకాకుండా కొన్ని సంస్థలకు భూకేటాయింపులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్‌ను మార్చినట్లు తెలిపారు.మరో 16 సంస్థలకు భూకేటాయింపు విస్తరణపై చర్చించామని, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.అలాగే 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అమరావతి విషయంలో మూడుకోణాల్లో రాజకీయాలు ఆడినట్లు ఆరోపించారు.

Advertisements
అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ
అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

కక్షసాధింపు చర్యల కారణంగా అమరావతి అభివృద్ధి కుంటుపడిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ఆకర్షించి, అమరావతిని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Related Posts
వైసీపీలోకి శైలజానాథ్
Sailajanath

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన Read more

ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత
ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి Read more

ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది
ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది

ఉన్నతాధికారుల తొలగింపు - ఫైబర్‌నెట్‌లో మార్పులు ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల పై వేటు పడింది. ఫైబర్‌నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ భరద్వాజ, ఫైబర్‌నెట్ బిజినెస్ హెడ్ Read more

ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి ఊరట
ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి ఊరట

వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు..కాస్త ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే Read more

×