हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Modi: తహవ్వుర్‌ రాణా నిర్దోషిగా కాదు దోషినే: ప్రధాని మోదీ ట్వీట్

Vanipushpa
Modi: తహవ్వుర్‌ రాణా నిర్దోషిగా కాదు దోషినే: ప్రధాని మోదీ ట్వీట్

26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో రాణా గురించి గతంలో ప్రధానంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 2011లో ఈ కేసుకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేసింది. కానీ, ఆ దాడులకు కారణమైన ఉగ్ర సంస్థకు మద్దుతు ఇచ్చినందుకు రాణాను దోషిగా తేల్చింది.

నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్
అయితే ఆ తీర్పుపై స్పందిస్తూ 2011 జూన్​ 10న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్​ చేశారు. ముంబయి ఉగ్రదాడిలో తహవ్వుర్‌ రాణాను నిర్దోషిగా యూఎస్‌ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది విదేశాంగ విధానానికి భారీ ఎదురుదెబ్బ’ అని మోదీ పోస్ట్​ చేశారు.

18 రోజుల కస్టడీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణాను భారత్​కు అప్పగించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అంతేకాకుండా అమెరికా న్యాయస్థానం కూడా రాణాను అప్పగించేందుకు అంగీకరించింది. ఇక గురువారమే భారత్​కు తీసుకొచ్చిన రాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్లీలోని పటియాలా హౌస్​ కోర్టుకు తరలించారు. 20 రోజులు కస్టడీకి కోరగా, 18 రోజుల కస్టడీకే ఎన్​ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చందర్‌జిత్‌సింగ్‌ అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఎన్​ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.

READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870