భూమికి తిరిగి చేరుకున్న సునీతా విలియమ్స్
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురితో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ప్రపంచం ఉత్కంఠతో వీరి రాకను వీక్షించింది
సునీతా విలియమ్స్ సహా మొత్తం నాలుగు మంది వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగి రావడంతో అంతర్జాతీయ స్థాయిలో దీని గురించి ఆసక్తిగా చర్చ జరిగింది. అంతరిక్ష ప్రయాణం తర్వాత వారు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

భారత్‌లో సంబరాలు
పూర్వీకుల గ్రామంలో ఆనందోత్సవాలు. సునీత సురక్షితంగా భూమికి చేరుకున్న సందర్భంగా గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. గ్రామస్థులు బాణాసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“సునీత కోసం 9 నెలలుగా ఎదురుచూశాం.
భారత పర్యటనపై కుటుంబ సభ్యుల ఆనందం
సునీత త్వరలోనే భారత్‌కి రానున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. “ఇప్పుడు సునీత పూర్తిగా కుటుంబ సమయాన్ని ఆస్వాదించనుంది. త్వరలోనే ఆమె భారత్‌కి వస్తున్నారని మాకు తెలియజేశారు.
మేమంతా కలిసి వేకేషన్ ప్లాన్ చేస్తున్నాం” అని ఫాల్గుణి పాండ్య తెలిపారు.
ప్రధాని మోదీ ఆహ్వానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. మోదీ సునీతకు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. “మీరు భూమికి తిరిగి వచ్చిన తర్వాత మీరు భారత్‌కు రావాలని ఆశిస్తున్నాం. మా కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి గర్వకారణం” అని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ భారత పర్యటనలో గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది.