Stalin makes it clear that he opposes the three language formula

మూడు భాషల ఫార్ములాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ స్పష్టం

చెన్నై: కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీఎం స్టాలిన్‌ తాజాగా స్పందించారు. మూడు భాషల ఫార్ములాను తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.

మూడు భాషల ఫార్ములాను వ్యతిరేకిస్తున్నట్లు

మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..?

తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ మమ్మిల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతున్నారో మాత్రం చెప్పరెందుకు..?. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..? అని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్‌ నిలదీశారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.

హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది

మరోవైపు, స్టాలిన్‌ కుమారుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సైతం ఇదే అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తాము మాత్రం ఎప్పటికీ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఆయన తేల్చిచెప్పారు.

Related Posts
షిరిడి వెళ్లే భక్తులకు అలర్ట్!
shiridi

ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. Read more

కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం:సీఎం రేవంత్ రెడ్డి
కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి

కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం:సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో ప్రధానాంశాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత స్పష్టంగా, సహజంగా తిరిగి Read more

గాజాలో ఆసుపత్రిపై ఇజ్రాయిల్ కాల్పులు : ఆసుపత్రి లో మందులు లేని పరిస్థితి
hospital attack

గాజాలోని కమాల్ అద్వాన్ ఆసుపత్రి డైరెక్టర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆసుపత్రికి 17 పోషకాహార లోపం ఉన్న పిల్లలు చేరుకున్నారు. అయితే, ఈ పిల్లల చికిత్సకు Read more

తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ
Judicial inquiry into the T

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో Read more