हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: గుజరాత్ ఓటమి పై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే!

Anusha
IPL 2025: గుజరాత్ ఓటమి పై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే!

ఐపీఎల్‌లో భాగంగా, సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్‌మన్ గిల్, పవర్ ప్లేలోనే తమ ఓటమి ఖాయమైందని చెప్పాడు. ‘రాజస్థాన్ ఓపెనర్లు పవర్ ప్లేలోనే మా విజయాన్ని లాగేసుకున్నారు. ఈ గెలుపు క్రెడిట్ వారి విధ్వంసకర బ్యాటింగ్‌కే దక్కుతుంది. మేం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. అయితే బయట కూర్చొని చాలా సలహాలు ఇవ్వవచ్చు. ఆరంభంలోనే మాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మేం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. జట్టులో కొన్ని విషయాల్లో మేం ఇంకా మెరుగవ్వాలి.వెన్ను నొప్పితోనే ఫీల్డింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ తర్వాత మాకు వరుసగా మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఫిజియో రిస్క్ వద్దన్నాడు. విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. గెలిచినా.. ఓడినా మేం పెద్దగా పట్టించుకోం. ఓ మ్యాచ్ ముగిసిందనే భావిస్తాం. తదుపరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో ఉంది. అక్కడ మాకు మంచి రికార్డ్ ఉంది. కాబట్టి పుంజుకుంటామని ఆశిస్తున్నా. ఈ రోజు వైభవ్ సూర్యవంశీది. అతని హిట్టింగ్ అద్భుతం. తనకు కలిసొచ్చిన రోజును అతను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.’అని శుభ్‌మన్ గిల్ కొనియాడాడు.

 IPL 2025: గుజరాత్ ఓటమి పై శుభ్‌మన్ గిల్ ఏమన్నారంటే!

హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), జోస్ బట్లర్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా సాయి సుదర్శన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీస్ తీక్షణ(2/35) రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీకి తోడుగా యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. రియాన్ పరాగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Read Also: IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870