हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Shresta Iyer: శ్రేయాస్ అయ్య‌ర్‌పై ట్రోల్స్‌ స్పందించిన శ్రేష్టా అయ్య‌ర్

Anusha
Shresta Iyer: శ్రేయాస్ అయ్య‌ర్‌పై ట్రోల్స్‌ స్పందించిన శ్రేష్టా అయ్య‌ర్

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్ర‌తీకార విజ‌యం సాధించింది. చిన్న‌స్వామిలో త‌మ‌ను చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్‌ పై 7 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. తొలుత సుయాశ్ శ‌ర్మ‌(2-26), కృనాల్ పాండ్యా(2-25)ల విజృంభ‌ణ‌తో పంజాబ్‌ను 157 క‌ట్ట‌డి చేసిన ఆర్సీబీ ఛేద‌న‌లో చెలరేగింది. ప్ర‌త్య‌ర్థి బౌలర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని విరాట్ కోహ్లీ(73 నాటౌట్) ఇప్యాంక్ట్ ప్లేయ‌ర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్(61)లు హాఫ్ సెంచ‌రీలతో హోరెత్తించారు. జితేశ్ శ‌ర్మ‌(11) సిక్స‌ర్ బాద‌డంతో మ‌రో 7 బంతులు ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది బెంగ‌ళూరు.సొంత‌గడ్డ‌పై చ‌తికిల‌ప‌డుతూ ఇత‌ర మైదానాల్లో విజ‌య‌ఢంకా మోగిస్తున్న ఆర్సీబీ అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించింది. పంజాబ్ కింగ్స్‌ను వాళ్ల ఇలాకాలో చిత్తుగా ఓడించింది. 158 ప‌రుగుల ఛేద‌న‌లో విరాట్ కోహ్లీ(73 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో క‌దం తొక్క‌గా ఇప్యాంక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్(61) ఖ‌త‌ర్నాక్ బ్యాటింగ్‌తో చెల‌రేగాడు. వీళ్లిద్ద‌రి మెరుపుల‌తో గెలుపు దిశ‌గా దూసుకెళ్లిన ఆర్సీబీ 18.5 ఓవ‌ర్లోల‌నే ల‌క్ష్యాన్ని చేరుకుని శ్రేయ‌స్ అయ్య‌ర్ బృందానికి పెద్ద షాకిచ్చింది.

ఓటమి పై స్పందించిన శ్రేయస్ అయ్యర్

మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను చెప్పాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అతడు మాట్లాడుతూ.. “ఈ ఓటమి చిన్నదే. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తిరిగి పుంజుకుంటాం. మా బ్యాటర్లు చాలా మంది మొదటి బంతి నుంచే ఆటలోకి దిగాలనుకుంటారు. అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడంలో మేం కొంత ఇబ్బంది పడుతున్నాం. మేము మంచి ఆరంభాలు సాధించినప్పటికీ వాటిని పెద్ద స్కోర్‌గా మలచలేకపోతున్నాం. డిఫెండ్ చేసుకోగలిగే స్కోరును సెట్ చేయలేకపోతున్నాం.ఈ మ్యాచ్ విషయానికొస్తే, మేం మంచి ఆరంభాన్ని అందుకున్నాం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. విరాట్ తో ఆ జట్టులోని ఇతర బ్యాటర్లు మంచి ప్రదర్శన చేశారు. మేము పిచ్‌కు అనుగుణంగా ఆడాలని చర్చించుకుంటూనే ఉంటాం. మా ఇద్దరు ఓపెనర్లు కూడా చక్కటి షాట్లు ఆడగలగే వాళ్లే. వాళ్లను నెమ్మదిగా ఆడమంటే, వాళ్లకు పిచ్ ను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇకపై మేం బలమైన స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నా మైండ్‌సెట్ బానే ఉంది. 10 పరుగులు దాటితే చాలు, బాగా రాణించగలనన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మాకు 6 రోజులు బ్రేక్ వచ్చింది. మా తప్పులను సరిచేసుకుని, శారీరకంగా, మానసికంగా బలంగా తిరిగి పుంజుకుంటాం. నెక్ట్స్ మ్యాచులో ఉత్తమంగా రాణించడం చాలా ముఖ్యం” అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

https://twitter.com/SG77Era/status/1913986239973507541?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1913986239973507541%7Ctwgr%5Eca173ed22afb365305136648aa09fc6417f2893c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsports%2Fshreyas-iyers-sister-shresta-hits-back-over-social-media-trolling-1967680

ట్రోల్స్‌

పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం పై శ్రేయాస్ అయ్య‌ర్‌పై ట్రోల్స్‌ మొదలయ్యాయి.దీని పై శ్రేష్టా అయ్య‌ర్ స్పందించింది. ఆమె త‌న ఇన్‌స్టా స్టోరీలో రియాక్ట్ అయ్యారు.”మేము మైదానంలో ఉన్నా, దూరం నుంచి ప్రోత్సహించినా జట్టుకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. నాపై వేలెత్తి చూపిస్తున్న వారి సంకుచిత మనస్తత్వం నవ్వొచ్చేలాగే కాదు, సిగ్గుచేటుగా కూడా ఉంది. నేను ఎన్నో మ్యాచ్‌లకు హాజరయ్యాను, వాటిలో చాలా వరకు విజయాలే ఉన్నాయి. కానీ స్క్రీన్ వెనుక దాక్కుని ట్రోల్ చేసేవారికి వాస్తవాలు పట్టవు కాబోలు” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also: SRH: పేలవ ప్రదర్శన కారణంగా షమీ, ఇషాన్ కిషన్‌ పై ఎస్ఆర్ హెచ్ వేటు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870