Spadex experiments to resume from March 15.. ISRO

మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు పునఃప్రారంభం : ఇస్రో

ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతం

న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా నింగిలోనే ఉపగ్రహాలను అనుసంధానించే ప్రత్యేక మిషన్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించిన ఇస్రో, ఈ ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు నారాయణన్ వెల్లడించారు.

Advertisements
మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు

ప్రయోగాల ప్రణాళిక

ప్రస్తుతం ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. వివిధ ప్రయోగాలను నిర్వహించేందుకు వచ్చే రెండు నెలల్లో 10 నుంచి 15 రోజుల అనుకూల సమయం ఉంటుంది.ప్రస్తుతం ఉపగ్రహాలను విడదీసి, రీ-డాకింగ్‌ చేసే అనుకరణ ప్రయోగాలు చేపట్టుతున్నాం. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్ తెలిపారు. ఇస్రో చీఫ్‌ ప్రకారం,ఉపగ్రహాల్లో తగినంత ఇంధనం ఉంది కాబట్టి మరిన్ని ప్రయోగాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే,రెండు నెలల తర్వాత మరో అనుకూల సమయంలో మూడో దశ ప్రయోగాలను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

భారత్ ఘనత

డాకింగ్‌, దృఢత్వ ప్రయోగాల అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్‌ శక్తి బదిలీకి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు వేస్తూ ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా,2023 డిసెంబర్ 30న ఛేజర్‌,టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పలు ప్రయత్నాల అనంతరం,జనవరి 16న డాకింగ్‌ ప్రక్రియ స్పేడెక్స్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.

Related Posts
Yogi Adityanath: ప్రధానమంత్రి పై స్పందించిన యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath: ప్రధానమంత్రి పై స్పందించిన యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్ స్పందన ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆరెస్సెస్ ప్రధాన Read more

మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..
ISRO Postpones Space Docking Experiment Again

బెంగళూరు : ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను Read more

కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్
new ration card ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా సంగంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, వచ్చే Read more

West Bengal : బెంగాల్ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట
Supreme Court gives relief to 25,000 teachers in Bengal

West Bengal : పశ్చిమ్ బెంగాల్‌లో ఉద్యోగాల నుంచి తొలగించిన 25 వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు భారీగా ఊరట కలిగించింది. కొత్త రిక్రూట్‌మెంట్ పూర్తయి.. కొత్తవారు Read more

Advertisements
×