हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

Anusha
IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా,సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌(జీటీ) 39 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(55 బంతుల్లో 90, 10ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్‌ అర్ధసెంచరీకి తోడు సాయి సుదర్శన్‌(36 బంతుల్లో 52, 6ఫోర్లు, సిక్స్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అరోరా, రానా, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్‌ రహానే(50) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ రెండేసి వికెట్లతో కోల్‌కతా పతనంలో కీలకమయ్యారు.

పవర్‌ప్లే

బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్‌ ఓపెనర్లు గిల్‌, సుదర్శన్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కోల్‌కతా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ద్వయం బౌండరీలతో విజృంభించారు. ఆరోరా మూడో ఓవర్‌లో సుదర్శన్‌ రెండు ఫోర్లతో చెలరేగగా, మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు గిల్‌ కూడా చెలరేగాడు.రానాను లక్ష్యంగా చేసుకుంటూ ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్‌ వికెట్‌ కోల్పోకుండా 45 పరుగులు చేసింది. ఎక్కడా జోరు తగ్గించని గిల్అలీ వేసిన 7వ ఓవర్‌లో వరుసగా 6,4, 4 బాదడంతో 17 పరుగులు వచ్చి చేరాయి. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని గిల్‌, సుదర్శన్‌ విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు.బంతి తేడాతో గిల్‌, సుదర్శన్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నారు. ఇన్నింగ్స్‌ దూసుకెళుతున్న తరుణంలో సుదర్శన్‌ను రస్సెల్‌ ఔట్‌ చేసి కోల్‌కతాకు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌నకు బ్రేక్‌పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్‌(41 నాటౌట్‌)..గిల్‌కు జతకలిశాడు. బట్లర్‌ను అండగా చేసుకుంటూ గిల్‌ మరింత చెలరేగాడు. దీంతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఊపందుకుంది. 18వ ఓవర్‌లో గిల్‌ ఔట్‌ కావడం, ఆ వెంటనే రాహుల్‌ తెవాటియా(0)కూడా పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో బట్లర్‌, షారుఖ్‌ఖాన్‌(11 నాటౌట్‌) బ్యాట్లు ఝులిపించడంలో విఫలం కావడంతో ఆఖరి 5 ఓవర్లలో గుజరాత్‌ 59 పరుగులకే పరిమితమైంది.

 IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు పై స్పందించిన శుభ్‌మన్ గిల్

ప్రదర్శన

మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ వికెట్ అనంతరం భావోద్వేగాలను అదుపు చేసుకోలేకనే గట్టిగా సంబరాలు చేసుకున్నానని వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు మ్యాచ్‌లే పాయింట్స్ టేబుల్‌లో మా స్థానాన్ని నిర్ణయిస్తుందని మేం చర్చించుకున్నాం. వరుసగా ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం. మేం ఎప్పుడూ ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండాలని మాట్లాడుకోలేదు. ఇలాంటి కండిషన్స్‌లో పరుగులు ఎలా చేయాలి? మ్యాచ్‌ను చివరి వరకు ఎలా తీసుకెళ్లాలి? అనే విషయాలు మాత్రమే చర్చించుకున్నాం. ఈ గేమ్‌లో మేం చాలా ముందున్నాం. అయితే మ్యాచ్‌లో పైచేయి సాధించడం ఒక ఎత్తు అయితే మ్యాచ్‌ను ముంగించడం మరో ఎత్తని చెప్పాడు.

Read Also:IPL 2025: మరోసారి ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870