Hyderabad:మీర్‌పేట హత్య కేసు వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు

Hyderabad:మీర్‌పేట హత్య కేసు వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు

తెలంగాణ లో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్యకేసు తాజాగా మరో మలుపు తిరిగింది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అన్ని ఆధారాలు తుడిచిపెట్టివేయాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. పోలీసులు తాజాగా డీఎన్‌ఏ రిపోర్టును అందుకున్నారు.రాచకొండ పోలీసులు కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

డిఎన్‌ఏ రిపోర్ట్

హత్య జరిగిన ఇంట్లో రక్తం చుక్క,వెంట్రుక పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, మాధవి పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయ్యింది . దీని ఆధారంగా నిందితుడు గురుమూర్తి హత్యకు పాల్పడినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది .

హత్య కేసు

వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జనవరి 28న రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సీపీ అన్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలో నివ్వెరపోయామన్నారు. క్షణికావేశంలో చేసిన హత్య కాదని పథకం ప్రకారమే హత్య చేశాడని అన్నారు. గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని ఆయన వివరించారు.సంక్రాంతి పండగకు మాధవి, గురుమూర్తి తమ పిల్లల్ని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లారని సీపీ సుధీర్ బాబు అన్నారు. 15న పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి వెంకటమాధవి, గురుమూర్తి రాత్రి 10.41 గంటలకు ఇంటికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్​లో గుర్తించామన్నారు. 16న ఉదయం 8 గంటలకు ఆమెతో అకారణంగా గొడవ పెట్టుకొని మాధవి తలను గోడకేసి కొట్టి కింద పడిపోయిన తర్వాత గొంతు నులిమి హతమార్చాడని దర్యాప్తులో తేలిందని తెలిపారు.

meerpet 2 V jpg 442x260 4g

మృతదేహాన్ని ముక్కలు చేసి

కత్తితో కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా కట్ చేశాడని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర గంటల వరకూ మృతదేహాన్ని ముక్కలు చేసినట్టు గుర్తించామని సీపీ తెలిపారు. వాటర్ హీటర్ నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడక బెట్టాడని, ఆ తర్వాత వాటిని స్టవ్​పై పెట్టి కాల్చాడని, రోకలి బండతో ఆ భాగాలను దంచి పొడి చేశాడని, ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్​లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోశాడని విచారణలో తెలిందని చెప్పారు.

మిస్సింగ్ కేసు

ముందుగా ఈ కేసునుపోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగానే పరిగణించి దర్యాప్తు చేపట్టగా, గురుమూర్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి దృఢమైన విచారణ చేపట్టారు. అతన్ని కఠినంగా ప్రశ్నించగా, తానే హత్య చేశానని, ఆధారాలు దొరికితే అరెస్టు చేసుకోమని పోలీసులను సవాల్ చేశాడు.దీంతో పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఆధారాల కోసం దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వారు అనుకున్నట్లుగానే ఓ మూల రక్తపు చుక్క, టిష్యూ, వెంట్రుక లభించాయి. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా, మాధవి పిల్లల డీఎన్‌ఏతో 100% మ్యాచ్ అయ్యింది.

Related Posts
మళ్లీ వార్తల్లోకి మాజీ ఎంపీ కేశినేని నాని
Kesineni Nani is busy in po

గత ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ తెరపైకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి Read more

డిసెంబర్ లోపు మిగిలిన వారికి రుణమాఫీ చేస్తాం – మంత్రి పొంగులేటి
ponguleti runamafi

రాష్ట్ర రెవెన్యూ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలోపు మిగిలిన వారికి కూడా Read more

ఏపీలో మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీలో మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే గ్రాడ్యుయేట్, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. Read more

ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్
MPDO attack

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి సహా ఇతరులపై న్యాయమూర్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *