చిరు పై సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్

చిరు పై సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్

సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు డ్యాన్స్‌ను చూసి తాను డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisements

డ్యాన్స్‌తో ఫిదా

సాయి పల్లవి మాట్లాడుతూ, “నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమాను తెగ చూసేదాన్ని. ఆయన డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. అప్పట్నుంచే డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆసక్తితోనే వివిధ డ్యాన్స్ షోలలో పాల్గొన్నాను” అని చెప్పుకొచ్చారు.

చిరంజీవితో డ్యాన్స్

అంతేకాదు, ఒక ఈవెంట్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయడం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అని సాయి పల్లవి పేర్కొన్నారు. ఇటీవల ‘తండేల్’ మూవీతో తెలుగులో మంచి హిట్ అందుకున్న సాయి పల్లవి, టాలీవుడ్‌లో ఇప్పటికే ‘ఫిదా’, ‘ఎంసీఏ’, ‘లవ్‌స్టోరీ’, ‘శ్యామ్‌సింగరాయ్’ వంటి హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’లో సీతగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Sai Pallavi Chiranjeevi Bhola 1200x768

సాయి పల్లవి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామతన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ మూవీలో నటించి ఆడియన్ను ఫిదా చేసింది. అయితే సినిమాల్లో మేకప్ వేసుకోకపోవడం, గ్లామర్ ట్రీట్ ఇవ్వకపోవడం వంటి విషయాలతో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమ్ అయింది. ఇక ఈ భామ డ్యాన్స్ కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ సినిమాలో హీరోయిన్ గా నటించి అలరించింది. తన యాక్టింగ్తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలిచింది.

Related Posts
Sri Reddy: విజయనగరం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయిన శ్రీరెడ్డి
Sri Reddy: విజయనగరం పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరు విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరైంది. ఎన్నికల వేళ తన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని Read more

Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ
Shivangi Movie: 'శివంగి' మూవీ రివ్యూ

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఫోకస్ పెరుగుతోంది.  ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో దేవరాజ్‌ భరణి ధరణ్‌ దర్శకత్వంలో Read more

2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ.. ఇలా చేయడం జక్కన్నకు న్యాయమేనా
mahesh rajamouli combo movie updates create tension for fans detailsd

టాలీవుడ్‌లో హీరోలు దర్శకులకంటే ఎక్కువగా క్రేజ్‌ను సంపాదిస్తారు అనేది సాధారణ అభిప్రాయం హీరోలు ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటారు కాబట్టి వారి క్రేజ్ దర్శకుల కంటే ఎక్కువగా Read more

Pushpa 2 The Rule | ఆర్‌ఆర్‌ఆర్‌ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌ టీం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.
pushpa 2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ Read more

Advertisements
×