Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి ఇప్పుడు సోషల్ మీడియాను కూడా శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సాదారణమైన నటన, సహజమైన అందం,తన అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సాయి పల్లవి తాజాగా భారతదేశంలోనే టాప్ మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వంటి లెజెండ్స్‌ను కూడా వెనక్కి నెట్టడం విశేషంగా మారింది.

Advertisements

సోషల్ మీడియా

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో సాయి పల్లవి గురించి తెలుసుకోవడానికి 25 శాతం మంది నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఎలాంటి నటీమణి సాధించని ఘనత కావడం గమనార్హం. సాధారణంగా సినీ నటులు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన సహజత్వంతోనే అభిమానులను ఆకర్షిస్తున్నారు. అందుకే అభిమానులు ఆమెను “నేచురల్ బ్యూటీ” గా అభివర్ణిస్తుంటారు.సాయి పల్లవికి ఉన్న ఆదరణను మరోసారి రుజువుచేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా పోస్టులు పెడుతున్నారు. “ఇది ఒక్క సాయి పల్లవికే సాధ్యమైంది. ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోని స్థానం ఇది” అంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.హీరో తలపథి విజయ్ 20 శాతం ఫాన్స్ ను ప్రభావితం చేస్తుండగా, ధోని 17 శాతం మందిని ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు.మిగిలిన ప్రముఖులు కలిపి మొత్తం 5 శాతం వరకు మాత్రమే ప్రభావం చూపుతున్నారట.

 Sai Pallavi: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీగా సాయిపల్లవి.!

బాక్సాఫీస్

ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి . మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుండగా,రాముడిగా రణబీర్ కపూర్ కనిపించనున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Read Also: Prabhas: జాట్ మూవీ టీమ్‌ని కలిసిన ప్రభాస్

Related Posts
అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో Read more

కేజ్రీవాల్ కు రాహుల్ గాంధీ సవాల్
kejrival rahul gandhi

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని రాహుల్ ఆరోపించారు. ఇటు ఆప్ లో, అటు బీజేపీలో.. రెండు Read more

PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్
PSL 2025: రెండో ఓటమిపై స్పందించిన రిజ్వాన్

పీఎస్‌ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 సీజన్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే గత మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న Read more

రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?
రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా కానున్నారు. ఈ గురువారం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×