Thummala Nageswara Rao

ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.

తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి రోజు ఒక్కో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నిధులను చెల్లించారు. 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో రూ. 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించింది. అయితే ఆ రోజు కేవలం మండలానికి ఒక గ్రామానికి చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేసారు . మిగితా గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు రాలేదు. అయితే ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తాజా ప్రకటన చేసారు. దీంతో ఈరోజు నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ను ప్రారంభంకానుంది.

Advertisements
thummala nageswara rao.jpg

రైతు భరోసా నిధులు ఈ రోజు నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో బుధవారం నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల పంపిణీ జరుగుతున్నదని ఆయన తెలిపారు. రైతు భరోసా స్కీం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Related Posts
Eid Ul Fitr 2025 : అసదుద్దీన్తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు
CM Revanth Iftar Dinner wit

హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇఫ్తార్ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ Read more

ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్
EC is an impartial system .. CEC Rajeev Kumar

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు Read more

Supreme Court : మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ పిటిషన్ కొట్టివేత
Petition of Mahatma Gandhi great grandson Tushar Gandhi dismissed

Supreme Court : సుప్రీంకోర్టు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాక..సబర్మతి ఆశ్రమం ఆధునికీకరణ అంశం భావోద్వేగాలతో ముడిపెట్టొద్దని సూచించింది. గుజరాత్‌ Read more

Elon musk : భారత్‌లో పర్యటించనున్న ఎలాన్‌ మస్క్‌
Elon Musk coming to India soon

Elon musk : ఈ ఏడాది చివర్లో అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయం Read more

Advertisements
×