Thummala Nageswara Rao

ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు.

తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి రోజు ఒక్కో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నిధులను చెల్లించారు. 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో రూ. 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించింది. అయితే ఆ రోజు కేవలం మండలానికి ఒక గ్రామానికి చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేసారు . మిగితా గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు రాలేదు. అయితే ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తాజా ప్రకటన చేసారు. దీంతో ఈరోజు నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ను ప్రారంభంకానుంది.

Advertisements
thummala nageswara rao.jpg

రైతు భరోసా నిధులు ఈ రోజు నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో బుధవారం నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల పంపిణీ జరుగుతున్నదని ఆయన తెలిపారు. రైతు భరోసా స్కీం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

Related Posts
Bomb Threat : మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
Bomb threats to Medchal Collectorate

Bomb Threats : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు Read more

దుబాయ్ వెళ్లింది మ్యాచ్ కోసం కాదు – హరీశ్ రావు క్లారిటీ
Another case against former minister Harish Rao

భారత రాష్ట్ర సమితి (BRS) నేత హరీశ్ రావు దుబాయ్ పర్యటనపై వస్తున్న ఆరోపణలకు స్పష్టతనిచ్చారు. తాను క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్లలేదని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త Read more

తెలంగాణ పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి Read more

ఏపీలో నేటి నుంచి నూతన మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ
liquor sales in telangana jpg

Wines bandh రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ Read more

×