న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 33.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఈసీఐ వివరాల ప్రకారం..అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యల్పంగా 29.74 శాతం పోలింగ్ నమోదైంది. సౌత్ వెస్ట్ జిల్లాలో 35.44 శాతం, న్యూఢిల్లీలో 29.89 శాతం, ఈస్ట్ 33.66 శాతం, నార్త్ 32.44 శాతం, న్యూఢిల్లీ 29.89 శాతం, ఈస్ట్ 33.36 శాతం, నార్త్ 32.44 శాతం, నార్త్ వెస్ట్ 33.17 శాతం, షహదర 35.81 శాతం, సౌత్ 32.67 శాతం, సౌత్ ఈస్ట్ 32.27 శాతం, వెస్ట్ 30.89 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు, మిల్కిపూర్ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు రికార్డు స్ధాయిలో 44.59 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గం ఉప ఎన్నికలో 42.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.