రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రైల్వే శాఖలో పలు నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు తాజా షెడ్యూల్ జారీ చేసింది. జూనియర్ ఇంజినీర్ (JE), కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 2) ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అడ్మిట్ కార్డులు & ఎంపిక ప్రక్రియ
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షకు 4 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సంబంధిత RRB వెబ్‌సైట్‌ను సందర్శించి, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఇటీవలే CBT 1 ఫలితాలను విడుదల చేయగా, దాదాపు 20,792 మంది అభ్యర్థులను CBT 2 పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేశారు. ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను RRB అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,951 ఖాళీలు భర్తీ చేయనున్నారు. CBT 1 పరీక్ష – ఇప్పటికే నిర్వహించబడింది, ఫలితాలు విడుదలయ్యాయి. CBT 2 పరీక్ష – ఏప్రిల్ 22న జరగనుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ – CBT 2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ దశకు అర్హత పొందుతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ – అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షకు ముందుగా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి అన్ని వివరాలు సరైనట్లుగా ఉన్నాయా లేదా పరిశీలించాలి. పరీక్ష కేంద్రానికి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ మరియు అడ్మిట్ కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. RRB అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలి.