opposition does not even have the slightest responsibility .. Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా లేదు : మంత్రి పొన్నం

Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం సభలో 56 శాతం బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే సందర్భంగా ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ లేదని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Advertisements
ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా

పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అన్నీ వారి సామాజిక వర్గమే. పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి. మేం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి ఒక్కో వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాం. మేం చేసిన కులగణన వల్ల 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రంలో అమలు చేసి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ సభ్యులపై ఉంది. మహేశ్వర్‌రెడ్డి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి అని పొన్నం సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ పద్దులను శాసనసభ ఆమోదించింది.

Related Posts
Earthquake : మయన్మార్‌కు మరోసారి భారత్ 30 టన్నుల విపత్తు సాయం
India once again provides 30 tonnes of disaster aid to Myanmar

Earthquake : మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. పెనువిధ్వంసంతో రెండు దేశాల ప్రజలు గజగజవణికిపోయారు. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. Read more

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది: ప్రధాని
Prime Minister Modi speech in the Parliament premises

న్యూఢిల్లీ : ఈరోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో Read more

సీఎం యోగి నివాసం కింద శివలింగం – అఖిలేశ్
సీఎం యోగి నివాసం కింద శివలింగం - అఖిలేశ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద శివలింగం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఈ విషయంపై Read more

సజ్జల కుటుంబంపై విచారణకు ఆదేశం
sajjala ramakrishna reddy

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నది. వారిపై అక్రమ కేసుల్ని పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నది. తాజా అంశంగా సజ్జల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×