రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

RBI: రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

చిన్న రుణ మొత్తాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయాలను తీసుకుంది. 50,000 రూపాయల వరకు ఉండే చిన్న రుణ మొత్తాలపై అధిక ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రాధాన్యత రంగాలు- ప్రత్యేకించి చిన్న మొత్తాల రుణాలపై దీన్ని వర్తింపజేసింది.
చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం..
50,000 రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలకు సంబంధించిన లేదా తాత్కాలిక సేవా ఛార్జీలు గానీ,ఇతర తనిఖీ ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక భారం నుండి చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం, ఈ పాలసీని మరింత సరళీకరించడంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Advertisements
రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

ఏప్రిల్ 1వ తేదీ అమలులోకి వస్తాయి
50 వేల రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలపై ఎలాంటి లోన్-సంబంధిత తాత్కాలిక సేవ ఛార్జీలు/తనిఖీ ఛార్జీలు ఇకపై ఉండబోవని తెలిపింది. తాజా ఆదేశాలు- ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే.. 2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వస్తాయి. ప్రాధాన్యత రంగ రుణాల కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి తీసుకున్న బంగారు ఆభరణాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వాటిని మినహాయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యాపార కార్యకలాపాల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునే వాళ్లు, రైతులు, బడుగు-బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందజేయడాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించినట్లు వివరించింది.
ఈ గైడ్‌లైన్స్ ప్రకారం..
ఈ కొత్త పీఎస్‌ఎల్ మార్గదర్శకాల వల్ల బ్యాంకుల జావాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం- ఒక ఆర్థిక సంవత్సరం త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లో, ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోగా ఈ పీఎస్ఎల్ రుణాలకు సంబంధించిన సమగ్ర డేటాను ఆర్బీఐకి అందజేయాల్సి ఉంటుంది. .

Related Posts
అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
indian money

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. జీఎస్టీలో కీలక మార్పులుజీఎస్టీ Read more

6 నుంచి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఐపీఓ ప్రారంభం
Standard Glass Lining IPO Starts From January 6

హైదరాబాద్‌: స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) జనవరి 6, 2025న ప్రారంభించబోతుంది. జనవరి 8, 2025న ముగుస్తుంది. ఒక్కో Read more

SS Rajamouli: ఆస్కార్ కమిటీకి ధ‌న్యవాదాలు తెలిపిన రాజ‌మౌళి
SS Rajamouli: ఆస్కార్ కమిటీకి ధ‌న్యవాదాలు తెలిపిన రాజ‌మౌళి

చాలాకాలంగా సినిమా రంగంలో స్టంట్ మాస్టర్స్, ఫైట్ కొరియోగ్రాఫర్లు, స్టంట్‌మెన్‌ వారు చేస్తోన్న కష్టానికి గౌరవం లభించదనే అభిప్రాయం వినిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు, ఏకంగా ఆస్కార్ Read more

వసంత పంచమి నాడు కుంభ మేళాలో హై అలర్ట్‌
maha kumbamela

మహాకుంభమేళా సందర్భంగా వసంత పంచమి నాడు జరగనున్న అమృత స్నానం నేపథ్యంలో, ప్రయాగరాజ్ డివిజన్‌లోని అన్ని వైద్య బృందాలను హై అలర్ట్‌లో ఉంచారు. తక్షణ సహాయం అందించడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×